
జన్నారం, వెలుగు: జన్నారం మండలం పొనకల్ పంచాయతీలోని అక్కపల్లిగూడ ప్రైమరీ స్కూల్ లో సోమవారం 32 మంది స్టూడెంట్లు అడ్మిషన్ తీసుకున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లల తల్లిదండ్రులను నేరుగా కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యాలను వివరించడంతో సోమవారం ఒకే రోజు 32 విద్యార్థులను స్కూల్ లో చేర్పించారని హెచ్ఎం జాజాల శ్రీనివాస్ తెలిపారు.
నాణ్యమైన విద్యతోపాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.