అక్కడ అన్నీ వింతలే: స్కూలుకెళ్లాలన్నా విమానమే

అక్కడ అన్నీ వింతలే: స్కూలుకెళ్లాలన్నా విమానమే

పసిఫిక్‌ మహాసముద్రంలో చిలీకి పశ్చిమం వైపున ఉంటుంది ఆ ద్వీపం. వైశాల్యం 48 చదరపు కిలోమీటర్లు. జనాభా 800. పెద్ద పెద్ద నౌకల విరిగిపోయిన భాగాలు ఎక్కడబడితే అక్కడ కనబడుతుంటాయి. ప్రజలు గుర్రాలు, గుర్రపు బండ్లపై తిరుగుతూ కనిపిస్తారు. అక్కడ వాచీలు ఎక్కు వగా వాడరు.ఎందుకంటే టైం చూసుకొని చేసేంత అర్జెంట్‌ పనులు చేసే వాళ్లు లేరు మరి. టెలివిజన్‌‌‌‌, కరెంటు వచ్చి ఎన్నో ఏళ్లయినా వేటాడి, లేదా దుంపలు తిని కాలం గడుపుతున్నారు. ద్వీపంలో చిన్న చిన్న వస్తువులు దొరికే షాపులు ఒకట్రెండు కనిపిస్తాయి. హైస్కూలు, హాస్పిటల్, సూపర్‌‌‌‌ మార్కెట్‌ కు వెళ్లాలంటే విమానం ఎక్కాల్సిందే. ఆ ద్వీపం పేరు ఇస్లా మోచా.

మాపుచీల రాజ్యం….

మోచా ద్వీపం, సముద్రంపై 17వ శతాబ్దం వరకు‘మాపుచీ’లు పెత్తనం చెలాయించారు. వాళ్లకు పడవ నడిపే సామర్థ్యం ఎక్కువని, చేపలు బాగా పడతారని, మంచి రైతులని ఆర్కియాలజిస్టుల ద్వారా తెలిసింది.మొక్కజొన్నను పులియబెట్టి ‘చిచా’ అనే మత్తు పదార్థాన్ని తయారు చేసుకునేవారు. గువనాకోలా ఉండే జంతువు ఉన్నితో బట్టలు నేసుకునేవారు. తొలిసారి ఆ ద్వీపానికి స్పెయిన్‌‌‌‌ వాళ్లు వెళ్లారు. కొందరు మాపుచీలను చంపేశారు. తర్వాత వెళ్లిపోయారు. మళ్లీ 1578లో ఇంగ్లిష్‌ నావికుడు ఫ్రాన్సిస్‌‌‌‌ డ్రేక్‌ ను సముద్రయానం చేస్తూ అక్కడి వెళ్లగా మాపుచీలు ఆపారు. ఆద్వీపపు ప్రజలు బాణాలతో వాళ్లను గాయపరిచారని డ్రేక్‌ గురువు చాప్లెయిన్‌‌‌‌ చెప్పారు. మొత్తానికి డ్రేక్‌ తన యాత్రను పూర్తి చేసినప్పటికీ చాలా మందికి గాయాలయ్యాయన్నారు. ఏదేమైనా ఆ ద్వీ పం చాలా అద్భుతమైన ప్రదేశమని, ఎంతో ఆహ్లాదకరంగా ఉందని రాసుకున్నారు.

మెల్లిమెల్లిగా మచ్చికై…

మెల్లిమెల్లిగా మాపుచీలు, నావికుల మధ్య సంబంధాలు పెరిగాయి. డచ్‌ నావికులు ఓలివిర్‌‌‌‌,జోరిస్‌‌‌‌లు 16వ శతాబ్దంలో ఆ ద్వీపాని కి వెళ్లారు.‘మమ్మల్ని ద్వీ పవాసులు స్వాగతించారు. భయపడలేదు. దాడి చేయలేదు’ అన్నారు. కాలక్రమేనా బయటి వాళ్లు వస్తే తమకు కలిగే లాభం గురించి మాపుచీలకు బాగా తెలిసొచ్చింది. వచ్చినవారికి వెల్‌‌కమ్‌ చెప్పడం మొదలుపెట్టారు. దీంతో ఆ ద్వీపం నావికులకు స్వర్గంగా మారింది. మాపుచీలు వాళ్లు పండించే మొక్కజొన్న, ఆలూ, పశువులను నావికులకు ఇచ్చేవారు. వారి నుంచి స్టీల్‌‌‌‌ తీసుకొని తమ దేశస్థులకు అమ్మేవారు.

పక్కవారి అజమాయిషీ….

ఈ ద్వీపంపై ఇంగ్లిష్‌ , డచ్‌ వాళ్ల అజమాయిషీ మెల్లిమెల్లిగా ఎక్కువైంది. స్పెయిన్‌‌‌‌ వాళ్లను అక్కడ నుంచి తరిమేశారు. అయితే 1685లో అక్కడకెళ్లిన స్పానిష్‌ నావికులు పైరేట్లలా ప్రవర్తించారు. మాపుచీల పంటలను, గుడిసెలను తగులబెట్టారు. బతికినవారిని తమ దేశాని కి పట్టుకెళ్లారు. మాపుచీలు మళ్లీ ద్వీపంముఖం చూడలేదు. తర్వాత వందేళ్లలో ఆ ద్వీపం అడవైపోయింది. అయితే అప్పుడప్పుడు చేపలు, తిమింగళాలు పట్టేవారు అటువైపు వచ్చేవారు. మోచా, చిలీల మధ్య ఉన్న సముద్ర భాగంలో 19 శతాబ్దంలో తిమింగళాల వేట ఎక్కు వగా జరిగేది. అక్కడ వైట్‌ స్పెర్మ్‌‌‌‌ వేల్స్‌‌‌‌ ఎక్కు వని 1839లో ఓ మ్యాగజైన్‌‌‌‌ రాసింది. దానికి ‘మోచా డిక్‌ ’ అని పేరు పెట్టారు.