Allari Naresh: ఆ హీరో నా బాబాయ్..మా ఫ్యామిలీ మెంబర్‌లో ఒకడిగా ఉంటాడు

Allari Naresh: ఆ హీరో నా బాబాయ్..మా ఫ్యామిలీ మెంబర్‌లో ఒకడిగా ఉంటాడు

కొంత కాలంగా వరుస సీరియస్ సబ్జెక్టులతో మెప్పిస్తున్న అల్లరి నరేష్(Allari Naresh)..తిరిగి తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నాడు.తన 61వ సినిమా అయిన ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku) తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

మల్లి అంకం దర్శకుడి గా పరిచయమవుతున్న ఈ మూవీ నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్‌‌,పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. సోమవారం ఏప్రిల్ 22న హీరో నాని చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ ఈవెంట్ కి అతిధిగా వచ్చిన నా బాబాయ్ థ్యాంక్స్ అంటూ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చే డైలాగ్ మాట్లాడారు. 

Also Read: సుడిగాడు 2పై క్లారిటీ వచ్చేసింది.. అల్లరోడు పెద్ద సాహసమే చేస్తున్నాడుగా!

"ముందుగా ఈ ఈవెంట్కి అతిధిగా వచ్చిన మా బాబాయ్ నాని(Nani) థ్యాంక్స్.అడగ్గానే వచ్చిన బాబాయ్ నాని మా ఫ్యామిలీ మెంబర్‌లానే కలిసిపోతారు. తను ఈ వేడుకకు రావడం నిజంగా చాలా అనందంగా ఉంది. అలాగే 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా ఇంత బాగా రావడానికి టీం ఎఫర్ట్, రవి మాటలు, మల్లి డైరెక్షన్, సూర్య కెమరా వర్క్..ఇలా టెక్నీకల్ టీమ్ అందరం కలసి కష్టపడి ఇష్టపడి అద్భుతంగా చేసిన సినిమా ఇది" అని అల్లరి నరేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే, "చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మంచి కామెడీ మూవీతో వస్తున్నాను.కచ్చితంగా ఈ సమ్మర్‌లో మిమ్మల్ని బాగా నవ్విస్తాను. ఇందులో నవ్విస్తూ మంచి కంటెంట్ కూడా చెప్పబోతున్నాను. తప్పకుండా ఈ సినిమా మే3న ఫ్యామిలీతో కలిసి చూడండి" అని అల్లరి నరేష్ కోరారు. 

ట్రైలర్ విషయానికి వస్తే.. 

తన కామెడీ టైమింగ్‍తో అల్లరి నరేశ్ అదరగొట్టారు. తన మార్క్ ఎంటర్‌టైన్‍మెంట్‍తో నవ్వుకునేలా ఉంది. పెళ్లి కోసం ఆరాటపడే యువకుడు గణ పాత్రను పోషించిన అల్లరోడు..తనదైన కామెడీతో అల్లరి చూపించాడు.అతడికి 25 రోజుల 10 గంటల 5 నిమిషాల్లోగా పెళ్లి జరగాలని, లేకపోతే జన్మంతా బ్రహ్మాచారిగానే ఉండిపోతాడని జ్యోతిష్యుడు చెప్పడం..ఆ తర్వాత పెళ్లెప్పుడు అని గణను అందరూ అడుగటం సరదాగా ఉంది. ఇక అతడికి పెళ్లి సంబంధం కుదిర్చేందుకు ఫ్యామిలీ మెంబర్స్ పలు విధాలుగా ట్రై చేయడం ఆకట్టుకుంటోంది.

పెళ్లి అనేది పాన్ ఇండియా సమస్య అని చెప్పడం సినిమాపై బజ్‌‌ను పెంచేలా ఉంది.ఫరియా అబ్దుల్లా (FariaAbdullah) హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

కొంత కాలంగా వరుస సీరియస్ సబ్జెక్టులతో మెప్పిస్తున్న అల్లరి నరేష్(Allari Naresh)..తిరిగి తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నాడు.తన 61వ సినిమా అయిన ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku) తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.