ఏపీ మంత్రి మేకపాటి శాఖలపై జగన్ కీలక నిర్ణయం

ఏపీ మంత్రి మేకపాటి శాఖలపై జగన్ కీలక నిర్ణయం

అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి నిర్వమించిన శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌతమ్ రెడ్డి నిర్వహించిన ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు మౌలిక వసతులు, చేనేత జౌళి, నైపుణ్యాభివృద్ధి శాఖలన్నింటినీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ కొద్దిసేపటి క్రితం నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇప్పటికే ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాలు, వాణిజ్య పన్నుల శాఖలను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీటితో పాటు అదనంగా మేకపాటి నిర్వహించిన ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, నైపుణ్య శిక్షణ, మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖలను కూడా బుగ్గనకు అప్పగిస్తూ గవర్నర్‌‌కు  సీఎం ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను ఆమోదించిన గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ నోటిఫికేషన్‌ ఇచ్చారు. 

 

ఇవి కూడా చదవండి

వైసీపీకి సహకరించిన వాళ్లను పట్టించుకోవడం లేదు

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్