ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్షర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రాకా’ (Raaka) . సుమారు 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పుడు సినీ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుంది. ఇటీవల ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘రాకా’ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా ఈ మూవీలో నటీనటులు అందుకుంటున్న రెమ్యునరేషన్లు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..
అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
ఈ సినిమా కోసం నటీనటులు అందుకుంటున్న రెమ్యునరేషన్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్: ఈ ప్రాజెక్ట్ కోసం బన్నీ ఏకంగా 175 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టాక్ . ఒక పోలీస్ ఆఫీసర్‌గా, సగం మనిషి-సగం మృగం వంటి వింత పాత్రలో, ఒక తండ్రి పాత్రలో అల్లు అర్జున్ అలరించబోతున్నారు.
దీపికా, రష్మికకు ఎంతంటే?
ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేకు ఈ సినిమా కోసం 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఆమె కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ అయినప్పటికీ, అల్లు అర్జున్ పారితోషికంతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. నేషనల్ క్రష్ రష్మిక ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించవచ్చని టాక్. దీనికోసం ఆమెకు 5 నుండి 7 కోట్ల రూపాయలు అందుతున్నట్లు సమాచారం.
కథా నేపథ్యం
‘రాకా’ అంటే సంస్కృతంలో ‘పూర్ణమి’ అని అర్థం. ఈ టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమాలో అతీంద్రియ శక్తులు, పారలల్ యూనివర్స్వంటి ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ ఉండనున్నాయి. ‘అవతార్’ వంటి చిత్రాలను తలపించేలా విజువల్ ఎఫెక్ట్స్,వరల్డ్ బిల్డింగ్ కోసం సన్ పిక్చర్స్ భారీగా ఖర్చు చేస్తోంది. అట్లీ ఈ సినిమాను ఒక హై-కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్, సోషియో-ఫాంటసీ ఎపిక్‌గా తీర్చిదిద్దుతున్నారు.
►ALSO READ | OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 18కి పైగా సినిమాలు.. తప్పక చూడాల్సిన బెస్ట్ లిస్ట్ ఇదే
దీపికా, రష్మికలతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇంతమంది స్టార్ హీరోయిన్లు ఒకే స్క్రీన్‌పై కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, 2026 చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసుకుని, 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది. షారుఖ్ ఖాన్ వంటి దిగ్గజాలు సైతం ఈ పోస్టర్‌ను చూసి ఫిదా అయ్యారంటే, ‘రాకా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో అర్థం చేసుకోవచ్చు..
