నాలుగు సినిమాల కష్టం పుష్ప

నాలుగు సినిమాల కష్టం పుష్ప

‘అఖండ’ ట్రెమండస్ సక్సెస్‌‌‌‌కి కంగ్రాట్యులేషన్స్. చాలా రోజుల తర్వాత ఒక బ్యాట్స్‌‌‌‌మెన్ మ్యాచ్ ఆడి ఫస్ట్ బాల్ సిక్సర్ కొడితే ఎంత కిక్ వస్తుందో తెలుగు సినిమాకు అంత ఊపు ఇ చ్చింది ‘అఖండ’ టీమ్. ఇదే ఊపును డిసెంబర్ 17న థియేటర్స్‌‌‌‌లో మేము కంటిన్యూ చేస్తాం. సినిమా గెలవాలి.. సినిమాలు గెలవాలి. తెలుగు సినిమాతో పాటు ఇండియాలో వచ్చే అన్ని సినిమాలు గెలవాలి. 

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన ‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 17న రిలీజవుతున్న సందర్భంగా నిన్న హైదరాబాద్‌‌‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ ‘నా ఫేవరేట్ డైరెక్టర్ సుకుమార్. పగలు రాత్రి తేడా లేకుండా ఈ మూవీకి వర్క్ చేస్తున్నాడు. ముంబైలో ఎవరిని అడిగినా ‘పుష్ప’ కోసం ఎదురుచూస్తున్నాం అని చెబుతున్నారు. కచ్చితంగా అక్కడ కూడా ఈ మూవీని ప్రమోట్ చేయాలి. ఇది బన్నీ సినిమా మాత్రమే కాదు..  తెలుగు ఇండస్ట్రీ సినిమా. బన్నీ ఇండస్ట్రీకి ఓ గిఫ్ట్, చాలామందికి ఇన్‌‌‌‌స్పిరేషన్‌‌‌‌’ అని చెప్పారు. మరో గెస్ట్ కొరటాల శివ మాట్లాడుతూ ‘పుష్ప లాంటి సినిమాను, ఇలాంటి పాత్రలను సుకుమార్ తప్ప ఎవరూ క్రియేట్ చేయలేరు. బన్నీలా ఎదుగుతున్న యాక్టర్ దేశంలోనే లేడు. ఈ సినిమాకు ఎంతో ఎఫెర్ట్ పెట్టాడు. పుష్ప 2 తర్వాత ఇంతకంటే పెద్ద కథతో ఆయన దగ్గరకు వస్తాను’ అని అన్నారు. ఫ్యాన్స్​కి ఈ సినిమా బిగ్గెస్ట్ ఫీస్ట్ అన్నారు అల్లు అరవింద్. ‘చాలా టఫ్ లొకేషన్స్‌‌‌‌లో తీశాం. బన్నీ డెడికేషన్, ప్యాషన్‌‌‌‌కి హ్యాట్సఫ్. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది’ అన్నారు  ప్రొడ్యూసర్స్. రష్మిక మాట్లాడుతూ ‘గీత గోవిందం టైమ్‌‌‌‌లో బన్నీతో యాక్ట్ చేయాలని కోరుకున్నా. ఇప్పుడు ఇందులో నటించడం హ్యాపీ. పుష్పతో కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం’ అని చెప్పింది. 

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘నేను, సుకుమార్, దేవిశ్రీ కలిసి ఒకేసారి జర్నీ స్టార్ట్ చేశాం. వాళ్లిద్దరినీ ఈ స్టేజ్‌‌‌‌పై మిస్ అవుతున్నా. బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వడం కోసం లాస్ట్ అవర్ వరకు పనిచేస్తూ సుకుమార్ ముంబైలో ఉన్నారు.  దేవి ఎప్పట్లాగే నాకు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు. రష్మిక నేషనల్ క్రష్. అందుకే ఆమెను క్రష్మిక అని పిలుస్తాను. నేను నటించిన వారిలో నాకు మనసుకు నచ్చిన అమ్మాయి. రాబోయే సినిమాలతో మరింత పేరు తెచ్చుకుంటుంది. స్పెషల్ సాంగ్‌‌‌‌ చేసిన సమంతకి  థ్యాంక్స్.  మంగళం శీనుగా సునీల్, ఎంపీగా  రావు రమేష్, బన్వర్ సింగ్ షెకావత్‌‌‌‌గా  పహద్ ఫాజిల్ పెర్ఫార్మెన్స్‌‌‌‌లను అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ ఒక్క సినిమా నాలుగు సినిమాల కష్టం. రెండేళ్లు అన్ని డిపార్ట్‌‌‌‌మెంట్స్ టెక్నీషియన్స్ ఎంతో కష్టపడ్డారు. ఎవరికి క్రెడిట్ వచ్చినా అది అందరిదీ. 17న మల్టీపుల్ లాంగ్వెజెస్‌‌‌‌లో పెద్ద పార్టీ ఇస్తున్నాం.