ఫేక్ అకౌంట్స్ అన్నింటినీ బ్లాక్ చేస్తం: మస్క్

ఫేక్ అకౌంట్స్ అన్నింటినీ బ్లాక్ చేస్తం: మస్క్

ఫ్యాన్ పేజ్ లు, పేరడి, కంటెంట్ క్రియేషన్ అకౌంట్ లతో పాటు, ట్విట్టర్ లో చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. వాటిలో బ్లూ టిక్ ఉన్నవీ ఉన్నాయి. ఆ అకౌంట్స్ నడుపుతున్నవాళ్లందరికీ ఎలన్ మస్క్ ఒక ఝలక్ ఇవ్వనున్నాడు. వాటన్నింటినీ తొలగించే ప్రయత్నం మొదలుపెట్టాడు. అకౌంట్ అడ్మిన్.. పేజ్ కి సంబంధించిన వివరాలు ట్విట్టర్ కి తెలపాలి. ఏ పేజ్ నడుపుతున్నారో ట్విట్టర్ కి సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తూ, బయోలో మెన్షన్ చేయాలి. లేకపోతే ఆ ట్విట్టర్ అకౌంట్ కు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అకౌంట్ ని శాశ్వతంగా బ్లాక్ చేయనున్నట్టు ప్రకటించాడు.

కంటెంట్ మాడరేషన్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు మస్క్. ఫ్యాన్ పేజ్ లు, పేరడి, కంటెంట్ క్రియేషన్ అకౌంట్స్ పేరుతో ఎక్కువగా ఫ్యాన్ వార్స్ నడిపిస్తూ ఫేక్ న్యూస్ స్ప్రేడ్ చేసేవాళ్లు పెరిగిపోయారు. దానివల్ల కంటెంట్ వయోలేషన్ జరుగుతుంది. యూజర్లు, అమాయకుల ప్రైవసీకి భంగం కలుగుతుంది. అందుకే ఇలాంటి అకౌంట్స్ ని పర్మనెంట్ గా బ్లాక్ చేయబోతున్నారు. ఇంతకుముందు హెచ్చరించిన తర్వాత యాక్షన్ తీసుకునేవాళ్లు. అయితే, ఇప్పుడు మారిన కొత్త రూల్స్ తో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ బ్లాక్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఎలన్ మస్క్ పేరుతో బ్లూ టిక్ ఉన్న ఫేక్ అకౌంట్ నుంచి బోజ్ పురి పాటను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.