టూర్ కి వెళ్లేటప్పుడు తప్పకుండా వీటిని తీసుకెళ్లాలి

టూర్ కి వెళ్లేటప్పుడు తప్పకుండా వీటిని తీసుకెళ్లాలి

కొత్త ప్లేస్​లకు వెళ్లినప్పుడు  అక్కడ ఏ ఇబ్బంది రాకుండా అవసరమైనవి తీసుకెళ్తాం. అలాగే,  ఎండాకాలంలో టూర్​కి వెళ్లేవాళ్ల బ్యాగ్​లో ముఖ్యమైన వస్తువులు కొన్ని ఉండాలి. గాడ్జెట్లు, ఫోన్ ఛార్జర్​తో పాటు మేకప్​ కిట్ కూడా ఉంటే టూర్​ ఎంజాయ్ చేయొచ్చు.  

  • ఎండాకాలంలో తొందరగా చెమట పడుతుంది. కాబట్టి ఒకే జత సాక్స్​ ఎక్కువ సేపు వేసుకుంటే   అవి చెమట వాసన వస్తాయి. అందుకని ఇంకో సాక్స్​ల జత తీసుకెళ్తే మంచిది.  
  • ముఖానికి ఎండ తగలకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. పెద్ద టోపీ, సన్​గ్లాసెస్ తీసుకెళ్లాలి. మధ్యాహ్నం బయటకి వెళ్లేటప్పుడు సన్​గ్లాసెస్ పెట్టుకుంటే​ అల్ట్రా వయొలెట్​ రేస్​ నుంచి కళ్లని కాపాడుకోవచ్చు. 
  • ట్రావెలింగ్​ చేసేటప్పుడు కంఫర్ట్​గా ఉండే బట్టలు వేసుకోవాలి. తొందరగా చెమటని పీల్చుకునే కాటన్ దుస్తులు వేసుకుంటే గాలి కూడా తగులుతుంది. 
  • చర్మం  ఫ్రెష్​గా ఉండేందుకు స్కిన్ కేర్ రొటీన్ తప్పనిసరి. పొడి చర్మం ఉన్నవాళ్లు జెల్ బేస్డ్ ప్రొడక్ట్స్, జిడ్డు చర్మం వాళ్లు వాటర్ బేస్డ్ ప్రొడక్ట్స్ తీసుకెళ్లాలి. ట్రావెల్ బ్యాగ్​లో ఫేస్​వైప్స్​ ఉంటే ఇంకా మంచిది. ముఖం డల్​గా ఉన్నప్పుడు ఫేస్​వైప్స్​తో తుడుచుకుంటే తేమ అంది 
  • ముఖం మెరుస్తుంది. ఎండలో బయటకి వెళ్లే ముందు సన్​స్క్రీన్ రాసుకోవడం మర్చిపోవద్దు.