రూ. 2,959 కోట్లకు అమర రాజా రెవెన్యూ

రూ. 2,959 కోట్లకు అమర రాజా రెవెన్యూ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అమర రాజా  ఎనర్జీ అండ్ మొబిలిటీ సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ. 309.80 కోట్ల లాభం (ట్యాక్స్‌‌‌‌ల ముందు) (కన్సాలిడేటెడ్‌‌‌‌) సాధించింది.  కిందటేడాది ఈ నెంబర్ రూ. 275.33  కోట్లుగా రికార్డయ్యింది. కంపెనీ రెవెన్యూ (కార్యకలాపాలు) రూ. 2,700.47 కోట్ల నుంచి రూ.2,959.34 కోట్లకు పెరిగింది. షేరుకి రూ. 4.80 ఇంటెరిమ్‌‌‌‌ డివిడెండ్ ఇచ్చేందుకు అమర రాజా బోర్డ్‌‌‌‌ ఆమోదం తెలిపింది. ఆటోమోటివ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో సేల్స్ పెరగడంతో కంపెనీ రెవెన్యూ పెరిగిందని కంపెనీ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది.  స్టాండ్‌‌‌‌ఎలోన్ ప్రాతిపదికన సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.2,810.76 కోట్ల రెవెన్యూ, రూ.293.46 కోట్ల లాభాన్ని  అమర రాజా పొందింది.