బీజేపీలో చేరను.. కాంగ్రెస్‌లో ఉండను

బీజేపీలో చేరను.. కాంగ్రెస్‌లో ఉండను

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్‌ బీజేపీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కెప్టెన్ భేటీ అవ్వడంతో ఇది నిజమేనని అందరూ అనుమానిస్తున్నారు. ఈ విషయంపై అమరిందర్ క్లారిటీ ఇచ్చారు. పంజాబ్ సీఎం పదవి నుంచి తనను బలవంతంగా తప్పించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తనను మూడుసార్లు అవమానించిందన్నారు. బీజేపీలో తాను చేరబోవడం లేదని, కాంగ్రెస్‌లోనూ కొనసాగనని క్లారిటీ ఇచ్చారు. 

‘ప్రస్తుతం నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా. కానీ ఇకపై పార్టీలో ఉండను. నాకు సరైన గౌరవం దక్కడం లేదు. అందుకే పార్టీలో ఉండదల్చుకోలేదు. ఈ విషయాన్ని అధిష్టానానికి స్పష్టంగా చెప్పాను. కాంగ్రెస్‌కు రాజీనామా చేయనప్పటికీ పార్టీలో ఉండను. నమ్మకం లేని చోట ఎవరూ ఉండరు. నేను బీజేపీలో చేరబోవడం లేదు’ అని కెప్టెన్ పేర్కొన్నారు. పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూపై అమరిందర్ మరోమారు విమర్శలకు దిగారు. సిద్ధూది చిన్న పిల్లల మనస్తత్వం అని.. ఆయన నిలకడ లేని మనిషి అని కామెంట్ చేశారు. పార్టీ చీఫ్‌గా ఉంటూ పంజాబ్‌ను సమర్థంగా నడిపించే సత్తా సిద్ధూకు లేదన్నారు. సిద్ధూ ఒంటరివాడని.. పార్టీలోని అందర్నీ కలుపుకుపోయే మనస్తత్వం ఆయనది కాదన్నారు.

మరిన్ని వార్తల కోసం: 

కేటీఆర్ కనబడుట లేదు

పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. బూతులు తిడుతూ.. 

వాగులో కొట్టుకుపోతున్న వాహనదారుడ్ని కాపాడిన కానిస్టేబుల్

చెబితే వింటది.. చెప్పింది చేస్తది