ఆఫీస్‌‌‌‌కు రమ్మన్నందుకు.. రూ.1.7 కోట్లు వదిలేసుకున్న అమెజాన్ ఉద్యోగి

ఆఫీస్‌‌‌‌కు రమ్మన్నందుకు.. రూ.1.7 కోట్లు వదిలేసుకున్న అమెజాన్ ఉద్యోగి

న్యూఢిల్లీ :  ఆఫీస్‌‌‌‌కు తిరిగిరావాలని అమెజాన్ అడగడంతో పూర్తిగా జాబే మానేశాడు యూఎస్‌‌‌‌కు చెందిన ఓ వ్యక్తి. కేవలం జాబ్ మానేస్తే ఓకే కానీ రూ.1.7 కోట్ల (200,000 డాలర్ల) విలువైన స్టాక్ ఆప్షన్స్‌‌‌‌ను వదులుకున్నాడు కూడా. అయినా తనకు ఎటువంటి బాధ లేదని చెబుతున్నాడు జాన్‌‌‌‌ (పేరు మారింది). ఉద్యోగులు తిరిగి ఆఫీస్‌‌‌‌కు రావడాన్ని అమెజాన్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో న్యూయార్క్ నుంచి సియాటల్‌‌‌‌ వరకు  జాన్ ట్రావెల్ చేయాల్సి ఉంటోంది. తన డ్రీమ్‌‌‌‌ లైఫ్‌‌‌‌ను వదులుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు.  ‘అమెజాన్‌‌‌‌లో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశా. గత మూడున్నరేళ్లుగా సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్ మేనేజర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశా. నా టీమ్‌‌‌‌తో కలిసి పనిచేయడం ఎక్సైటింగ్‌‌‌‌గా ఉండేది. తిరిగి ఆఫీస్‌‌‌‌లకు రావాలని అడగక పోయి ఉంటే జాబ్‌‌‌‌ మానేసేవాడిని కాను’ అని ఆయన వివరించారు.

2020 ఏప్రిల్‌‌‌‌లో అమెజాన్‌‌‌‌లో జాయిన్ అయ్యానని, అదే టైమ్‌‌‌‌లో కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్‌‌‌‌ పాలసీ తెచ్చిందని చెప్పారు. ‘నేను న్యూయార్క్‌‌‌‌లో  ఉంటున్నాను. నేను, నా భార్య కలిసి  తాజాగా డ్రీమ్‌‌‌‌ ప్రాపర్టీ తీసుకున్నాం. సియాటల్‌‌‌‌కు తిరిగి వెళ్లే ఛాన్సే లేదు’ అని జాన్ బిజినెస్‌‌‌‌ ఇన్‌‌‌‌సైడర్‌‌‌‌‌‌‌‌కు వెల్లడించారు. రీలొకేట్ అవ్వాలంటే రూ.1.2 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇదే విషయాన్ని కంపెనీకి తెలియజేశానని పేర్కొన్నారు. వర్క్ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌ మరికొంత కాలం చేసేలా టైమ్ అడిగానని చెప్పారు. కానీ, దీనికి తన బాస్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు.