అమెజాన్‌‌ ఫెస్టివల్‌‌ సేల్‌‌ 17 నుంచి..

అమెజాన్‌‌ ఫెస్టివల్‌‌ సేల్‌‌ 17 నుంచి..

భారీ డిస్కౌంట్లు ఇస్తామని ప్రకటన
కొన్నింటిపై 70 శాతం వరకు తగ్గింపు

న్యూఢిల్లీ: పండగ సీజన్‌‌ను పురస్కరించుకొని ఈ నెల 17 నుంచి గ్రేట్‌‌ ఇండియా ఫెస్టివల్‌‌ను నిర్వహిస్తున్నట్టు ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీ అమెజాన్‌‌ వెల్లడించింది. బిగ్‌‌ బిలియన్ డేస్‌‌ పేరుతో తాము ఈ నెల 16 నుంచి ఫెస్టివల్‌‌ సేల్‌‌ జరుపుతామని ఫ్లిప్‌‌కార్ట్‌‌ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అమెజాన్‌‌ ప్రైమ్‌‌ మెంబర్షిప్‌‌ ఉన్న వారికి 24 గంటల ముందే సేల్‌‌ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అంటే సాధారణ కస్టమర్లతో పోలిస్తే ప్రైమ్‌‌ మెంబర్లు ఒక రోజు ముందే డిస్కౌంట్లు, ఆఫర్లు పొందవచ్చు. మొబైల్‌‌ ఫోన్స్‌‌, యాక్సెసరీలు, ఎలక్ట్రానిక్‌‌ గూడ్స్‌‌పై భారీగా తగ్గింపులు ఉంటాయని అమెజాన్‌‌ చెబుతోంది. హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌ కార్డులు, ఈఎంఐల ద్వారా కొనేవారికి అదనంగా పది శాతం డిస్కౌంట్‌‌ ఇస్తారు. మొదటిసారిగా అమెజాన్‌‌ ద్వారా షాపింగ్‌‌ చేసే కస్టమర్లకు రూ.వెయ్యికి మించిన ఆర్డర్లపై అదనంగా ఐదుశాతం డిస్కౌంట్‌‌ ఇస్తారు. చిన్న బిజినెస్‌‌లను ఎంకరేజ్‌‌ చేయడానికి ఈ ఫెస్టివల్‌‌ సేల్‌‌లో వాటి ప్రొడక్టులపై స్పెషల్‌‌ డిస్కౌంట్లు ఇస్తారు. వన్‌‌ప్లస్‌‌ 8టీ, శామ్‌‌సంగ్ గెలాక్సీ ఎస్‌‌20 ఎఫ్‌‌ఈ మోడల్స్‌‌ను గ్రేట్‌‌ ఇండియా ఫెస్టివల్‌‌ సమయంలోనే లాంచ్‌‌ చేస్తారు. మొత్తం ఆరు వేల ఎలక్ట్రానిక్‌‌, యాక్సెసరీలపై డీల్స్‌‌ ఉంటాయని అమెజాన్‌‌ ప్రకటించింది. గేమింగ్‌‌ డివైజ్‌‌లపై 55 శాతం వరకు తగ్గింపు ఉంటుందని, సాఫ్ట్‌‌వేర్‌‌ ప్రొడక్టులపై 70 శాతం వరకు డిస్కౌంటు ఉంటాయని తెలియజేసింది. అమెజాన్‌‌ సొంత ప్రొడక్టులు ఇకో, ఫైర్‌‌ టీవీ, కిండిల్ డివైజెస్‌‌ ధరలను సగం తగ్గిస్తామని ప్రకటించింది. టీవీలను, హోం అప్లయెన్సెస్‌‌ను 65 శాతం తగ్గింపు రేట్లకు కొనుక్కోవచ్చని పేర్కొంది. బజాజ్‌‌ ఫిన్‌‌సర్వ్‌‌ కార్డులతో షాపింగ్‌‌ చేస్తే నో కాస్ట్‌‌ ఈఎంఐ సదుపాయం పొందవచ్చు. అయితే ఈ సేల్‌‌ ఎప్పుడు ముగుస్తుందనే విషయాన్ని అమెజాన్‌‌ తెలియజేయలేదు. ఐదు రోజుల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

ఫైర్‌‌స్టిక్స్‌‌ కొత్త మోడల్స్‌‌ లాంచ్‌‌

సాధారణ టీవీలను స్మార్ట్‌‌టీవీలుగా మార్చే ఫైర్‌‌ టీవీ స్టిక్స్‌‌ కొత్త మోడల్స్‌‌ను అమెజాన్‌‌ ఇండియాలో లాంచ్‌‌ చేసింది. వీటిలో ఫైర్‌‌ టీవీ స్టిక్ రేటు రూ.నాలుగు వేలు. ఇందులో 1.7 హెజ్‌‌ల ప్రాసెసర్‌‌, ఫుల్‌‌హెచ్‌‌డీ స్ట్రీమింగ్‌‌, డ్యూయల్‌‌ బ్యాండ్‌‌ వైఫై వంటి పీచర్లు ఉన్నారు. ఇది అలెక్సా వాయిస్ రిమోట్‌‌తో వస్తుంది. ఇక ఫైర్‌‌ టీవీ స్టిక్ లైట్‌‌ రేటు రూ.మూడు వేలు కాగా, ఇది ఫుల్‌‌హెచ్‌‌డీ స్ట్రీమింగ్‌‌ను సపోర్ట్‌‌ చేస్తుంది. ఇదివరకటి ఫైర్‌‌స్టిక్‌‌ కంటే 50 శాతం శక్తిమంతమైనది. దీని రిమోట్‌‌ కంట్రోల్​లో వాయిస్ అసిస్టెంట్‌‌ ఉంటుంది.