
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇల్లు మారారు. ఢిల్లీలో కృష్ణ మార్గ్‌లో గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయీ ఉన్నారు. ఆయన నివసించిన బంగ్లాలోకి అమిత్ షా మారారు. ఇప్పటి వరకు అమిత్ షా అక్బర్ రోడ్డులోని బంగ్లాలో ఉన్నారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాజ్‌పేయీ నివసించిన బంగ్లాను అమిత్ షాకు కేటాయించారు. ఈ నెల 15న గృహ ప్రవేశం చేసిన షా..ఇవాళ ఆ ఇంటికి మారారు.