అమిత్ షాకు అస్వస్థత.. హాస్పిటల్ లో చేరిక

అమిత్ షాకు అస్వస్థత.. హాస్పిటల్ లో చేరిక

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అస్వస్థతకు లోనయ్యారు. గుజరాత్ రాష్ట్రంలో ఒకరోజు వ్యక్తిగత పర్యటనలో ఉన్న అమిత్ షా.. ఈ ఉదయం అహ్మదాబాద్ లోని కేడీ హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు జరిగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అమిత్ షాకు చేసిన ట్రీట్ మెంట్ వివరాలు కేడీ హాస్పిటల్ తెలిపింది.

“మెడ వెనుక భాగంలో లిపోమా గ్రంథికి ట్రీట్ మెంట్ జరిగింది. మత్తు మందు ఇచ్చి డాక్టర్లు అమిత్ షాకు చిన్నపాటి సర్జరీ విజయవంతంగా పూర్తిచేశారు. ఈ సర్జరీ తర్వాత అమిత్ షా డిశ్చార్జ్ అయ్యారు” అని కేడీ హాస్పిటల్ తెలిపింది.

ఇవాళ గుజరాత్ లోనే విశ్రాంతి తీసుకుని.. సెప్టెంబర్ 5న ఢిల్లీకి అమిత్ షా వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.