కుప్పకూలిన హెలికాప్టర్..వీడియో

 కుప్పకూలిన హెలికాప్టర్..వీడియో

ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన  ALH Dhruv Mark 3 హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. కేరళలోని కొచ్చిలో చాపర్‌ను పరీక్షించిన తరవాత ల్యాండింగ్ చేసే సమయంలో కంట్రోల్ తప్పి కిందపడింది. 25 అడుగుల ఎత్తులో ఉండగా హెలికాప్టర్ అకస్మాత్తుగా కుప్పకూలడంతో ఛాపర్ పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. హెలికాప్టర్ లో అకస్మాత్తుగా పవర్ లాస్ అవడం వల్ల తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

మార్చి 8న ALH Dhruv హెలికాప్టర్లను ఇండియన్ కోస్ట్ గార్డు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇదే హెలికాప్టర్ రీసెంట్ గా ముంబైలోనూ టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ధ్రువ్ హెలికాప్టర్లు వరుసగా ప్రమాదాలకు గురవుతుండటంతో వాటిని  బ్యాన్ చేయాలని ఇండియన్ కోస్ట్ గార్డు భావిస్తోంది. అయితే ధ్రువ్ హెలికాప్టర్లు ఎందుకిలా క్రాష్ అవుతున్నాయో అధికారులు నిర్ధరించలేకపోతున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది...పూర్తి వివరాలను అందేవరకు బ్యాన్ కొనసాగనుంది. ఈ హెలికాప్టర్లను HAL తయారు చేసింది. ఆర్మీ,నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌లలో వీటిని వినియోగిస్తున్నారు.