ప్రజావాణిలో రైతుల వినూత్న నిరసన

ప్రజావాణిలో రైతుల వినూత్న నిరసన

రంగారెడ్డి జిల్లాలో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ బాధితులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. గ్రామం, మండల స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడానికి పెద్ద సంఖ్యలో ప్రజావాణికి తరలివచ్చారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి, ఇతర పంటలకు తీవ్ర నష్టం జరిగిందని, తమను ఆదుకోవాలని పలువురు రైతులు, కాంగ్రెస్ నాయకులు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు.

వడగండ్ల వాన నష్టపరిహారం ఇవ్వాలంటు రాలిన వరిచేనుతో రైతులు వినూత్న నిరసన తెలిపారు. ధరణి సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అధికారుల తప్పులతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.