షాంఘై: చచ్చిపోయాడని డాక్టర్లు ప్రకటించిన ఓ ముసలాయన మార్చురిలో లేచి కూసున్నడు. షాంఘైలోని ఓ ఓల్డేజ్ హోంలో జరిగిందీ ఘటన. హోంలో ఉండే ఓ వృద్ధుడు చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. దాంతో బాడీని మార్చురీకి తరలించారు. ఇద్దరు వ్యక్తులు స్ట్రెచ్చర్‌పై ఎల్లో బ్యాగ్‌లో డెడ్ బాడీని మార్చురీలోకి తీసుకెళ్లగా.. అక్కడ బ్యాగ్ జిప్‌ను ఓపెన్ చేసుకుని వృద్ధుడు బయటకు వచ్చాడు. వృద్ధుడిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి కండిషన్ స్టేబుల్‌గా ఉందని డాక్టర్లు చెప్పారు.ఈ సంఘటనపై అధికారులు
విచారణకు ఆదేశించారు.
