బాలయ్య డైలాగ్స్​ను అలా వాడుకుంటా.. అనసూయ పోస్ట్ వైరల్

బాలయ్య డైలాగ్స్​ను అలా వాడుకుంటా.. అనసూయ పోస్ట్  వైరల్

బుల్లితెర యాంకర్, నటి అనసూయ నందమూరి హీరో బాలకృష్ణపై చేసిన కామెంట్స్​ వైరలవుతున్నాయి. అనిల్​ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘భగవంత్​ కేసరి’ ఈ దసరాకి ఫ్యామిలీ కమ్​ మాస్​ ఎంటర్​టైనర్​గా సందడి చేస్తోంది. 

ఇందులో గుడ్​ టచ్​ బ్యాడ్​ టచ్​ గురించి బాలయ్య వివరించే సీన్స్​పై యువ దర్శకుడు రాహుల్​ రవీంద్రన్​ కామెంట్​ చేశాడు. ఈ హీరో చెప్పకపోయుంటే ఈ విషయం జనాల్లోకి వెళ్లేందుకు మరో పదేళ్లు పట్టేదంటూ..మాస్‌ మసాల సినిమాలోనూ ఇలాంటి గొప్ప మెసేజ్‌ను పెట్టినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు.బాలకృష్ణ వల్ల మాత్రమే ఇది సులభంగా సాధ్యమైంది. అత్యంత ప్రభావవంతమైన పద్ధతిలో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు అంటూ రాహుల్ పేర్కొన్నారు. 

Also Read: 28 నుంచి కాంగ్రెస్ రెండో విడుత బస్సుయాత్ర

ఈ పోస్ట్​పై చర్చలో అనసూయ కూడా జాయిన్​ అయ్యింది. తన ఇన్​స్టా పోస్టుల్లో ఈ విషయాన్ని ఎప్పటినుంచో చెప్తున్నానని.. బాలయ్య బాబు చెప్పిన డైలాగ్స్​ను ఇకపై కొటేషన్స్​గా వాడుతానంటూ తెలిపింది. ఎందుకంటే ఐ (డోంట్​) కేర్​ అంటూ దర్శకుడు అనిల్​ను ట్యాగ్​ చేసింది. ప్రస్తుతం అనసూయ చేసిన పోస్ట్ చర్చల్లోకి వచ్చింది.