
- స్టాండ్‌బైగా తెలుగమ్మాయి
- జెమీమా, శిఖాకు నో ప్లేస్
న్యూఢిల్లీ: విమెన్స్ వన్డే వరల్డ్‌కప్‌కు ఇండియా టీమ్‌ను ఆలిండియా విమెన్స్ సెలెక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. లెజెండరీ ప్లేయర్ మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో తెలుగమ్మాయి, ఆంధ్ర ప్లేయర్ సబ్బినేని మేఘన.. స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైంది. టాప్ ఆర్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్, పేసర్ శిఖా పాండేకు చోటు దక్కలేదు. మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు న్యూజిలాండ్‌లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ ఏడాది స్టార్టింగ్‌లో జరిగిన ఆస్ట్రేలియా టూర్‌లో సూపర్ పెర్ఫామెన్స్ చూపెట్టిన లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ యస్తికా భాటియా, పేస్ ద్వయం మేఘనా సింగ్, రేణుకా సింగ్‌కు ప్రతిఫలం దక్కింది. టీమ్‌లో ఎక్కువ మంది పవర్ హిట్టర్స్ ఉండాలనే ఉద్దేశంతో పూనమ్ రౌత్‌ను కూడా పక్కనబెట్టారు. 2017లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా ఈసారి కప్ గెలవాలనే పట్టుదలతో కనిపిస్తున్నది. ఈ మెగా ఈవెంట్ తర్వాత మిథాలీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే చాన్స్ ఉంది. కాగా, వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగే ఐదు వన్డేల్లోనూ ఇదే టీమ్ పాల్గొంటుందని సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. వన్డేలకు ముందు కివీస్‌తో ఇండియా ఓ టీ20 మ్యాచ్ కూడా ఆడనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో మేఘనకు చాన్స్ వచ్చింది.
వరల్డ్‌కప్ టీమ్: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, తానియా భాటియా, రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ యాదవ్.
స్టాండ్ బై ప్లేయర్లు: సబ్బినేని మేఘన, ఏక్తా బిస్త్, సిమ్రాన్.