అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ గుడ్డులో కోడి పిల్ల

అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ గుడ్డులో కోడి పిల్ల

కోరుట్ల, వెలుగు : పిల్లలకు పౌష్టికాహారం సరఫరా చేయడంలో భాగంగా అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడీ కేంద్రాలకు పంపిణీ చేసిన గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షమైంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆదివారం వెలుగుచూసింది. కోరుట్ల పట్టణంలోని రథాలపంపు కాలనీకి చెందిన ఆకుల మన్విత అనే చిన్నారికి ఆదివారం స్థానిక అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడిగుడ్లను అందజేసింది. గుడ్డును ఉడికించేందుకు ప్రయత్నించే టైంలో ఓ గుడ్డు బరువు తక్కువగా ఉండడంతో పెంకును ఒలిచి చూడగా కోడిపిల్ల కనిపించింది.

ఈ విషయం బయటకు తెలియడంతో సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాసిరకం, కాలం చెల్లిన గుడ్లను సరఫరా చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి క్వాలిటీ గుడ్లు సరఫరా అయ్యేలా చూడాలని కోరారు.

ఎంక్వైరీ చేస్తున్నాం

అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీలో ఇచ్చిన గుడ్డులో కోడిపిల్ల వచ్చిన ఘటనలు ఎప్పుడూ జరగలేదని సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రేమలత చెప్పారు. కోరుట్లలోని గొల్లవాడ అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ చిన్నారికి ఇచ్చిన గుడ్డులో కోడిపిల్ల వచ్చినట్లు సమాచారం అందింది. ఈ విషయంపై మరో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేమలతతో కలిసి ఎంక్వైరీ చేసి ఉన్నతాధికారులకు రిపోర్టు ఇస్తామని చెప్పారు. వారి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.