రూ.12తో ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్షా బీమా యోజ‌న

రూ.12తో ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్షా బీమా యోజ‌న

ఢిల్లీ : ప్ర‌మాద‌వ‌శాత్తు వైక‌ల్యం చెందిన‌వారికి రూ.12తో ప్ర‌ధాన మంత్రి సుర‌క్షా బీమా యోజ‌న చెల్లించిన‌ట్లైతే రూ.2 నుంచి ల‌క్షా వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. ఇప్ప‌టికే ఈ ప‌థ‌కం ఉన్న‌ప్ప‌టికీ వార్షిక ప్రీమియం కోసం మీ బ్యాంకులో రూ.12 ఉంచుకోవాల‌ని అధికారులు తెలిపారు. ప్రీమియం చెల్లింపు ప్ర‌తీ ఏడాది మే 25వ తేదీ నుండి మే 31వ తేదీ మ‌ధ్య జ‌రుగుతుంటుంది.

18 నుంచి 70 ఏళ్ల వయస్సు గల వారెవరైనా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరొచ్చు. అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి సంప్రదిస్తే ఈ పథకంలో చేరుస్తారు. లేదా ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా ఈ పథకంలో చేరొచ్చు. ఇలా ఒక‌సారి చేరితే ప్ర‌తీయేటా ఆటోమెటిక్‌గా రెన్యువ‌ల్ అవుతుంది. ఈ ప‌థ‌కం కింద శాశ్వత వైకల్యం పొందినట్టయితే రూ.2 లక్షల‌ బీమా అదే పాక్షికంగా వైకల్యం పొందితే రూ.1 లక్ష జీవిత బీమా నామినికి లభిస్తుంది.

ఇది కేవలం ప్రమాదాల్లో సంఘ‌ట‌న‌ల‌కు మాత్ర‌మే వర్తిస్తుంది. స‌హ‌జ మ‌ర‌ణాల‌కు వ‌ర్తించ‌దు. బీమా క్లెయిమ్ కు నామిని డెత్ స‌ర్టిఫికెట్ లేదా అంగ‌వైక‌ల్య స‌ర్టిఫికెట్ బ్యాంకుకు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. వెరిఫికేష‌న్ త‌ర్వాత‌ బీమా క్లెయిమ్ స‌బంధిత నామిని అకౌంట్‌లో డ‌బ్బు జ‌మ అవుతుంది.