
ఖమ్మం, వెలుగు : ఖమ్మం కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్గా పని చేస్తున్న ఆయన గతంలో భద్రాద్రికొత్తగూడెం ఇన్చార్జి కలెక్టర్గా కూడా చేశారు. ఇప్పుడు ఖమ్మం కలెక్టర్గా బదిలీపై వచ్చారు. కాగా, ఇప్పటి వరకు ఖమ్మం కలెక్టర్ గా పని చేసిన ముజమ్మిల్ ఖాన్ బదిలీపై సివిల్ సప్లై డిపార్ట్మెంట్ డైరెక్టర్గా వెళ్లారు.
గతేడాది జూన్ 17న ఇక్కడ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న ముజమ్మిల్ఖాన్ ఏడాది కాలంలోనే జిల్లా పాలనలో తనదైన మార్క్ చూపించారు. మూతపడిన పాఠశాలల మళ్లీ ప్రారంభించడం, మహిళా మార్ట్ ప్రారంభం, సేంద్రియ రైతు బజార్ ఏర్పాటు, ఇంట్లో మొదటి కాన్పు ఆడబిడ్డ పుడితే స్వీట్లు పంపిణీ చేసి పండుగ చేయడం లాంటి ఎన్నో వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు.