రామ్ పోతినేనితో అనుపమ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తల్లి సునీత

రామ్ పోతినేనితో అనుపమ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తల్లి సునీత

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని(Ram pothineni) పెళ్లి విషయం ప్రస్తుతం సోసిల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది కూడా ఎవరితోనో కాదు మళయాల కుట్టి అనుపమ పరమేశ్వరన్(Anupama parameswaran) తో. దీంతో ఈ న్యూస్ తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలుసుకోవడానికి సర్చింగ్ కూడా మొదలుపెట్టేశారు. 

అయితే తాజాగా ఈ విషయంపై అనుపమ పరమేశ్వరన్ తల్లి సునీత రియాక్ట్ అయ్యారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె తేల్చిచెప్పేశారు. ప్రస్తుతం అనుపమ తన కెరీర్ పై ఫోకస్డ్ గా ఉన్నారని, తనకు ఇప్పుడప్పుడే పెళ్ళిచేసుకుని ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. నిజంగా తాను ఎవరినైనా ప్రేమిస్తే తమకు చెప్తినుందని, ఆ అభిప్రాయాన్ని తాము కూడా గౌరవిస్తామని తెలిపారు అనుపమ తల్లి. దీంతో రామ్ పోతినేని, అనుమప పెళ్లి పై వస్తున్న పుకార్లకు చెక్ పడింది.

ఇక ఈ ఇద్దరి సినిమాల విషయానికి వస్తే.. రామ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ స్కంద ఈటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. ఇక అనుమప ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజతో ఈగర్ మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే   ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.