హైదరాబాద్​ ను కోల్పోయాం... అందుకే విశాఖ అంటున్నా: సీఎం జగన్​ 

హైదరాబాద్​ ను కోల్పోయాం... అందుకే విశాఖ అంటున్నా: సీఎం జగన్​ 

గత ప్రభుత్వ విధానాల వల్ల కూడా బాగా నష్టం జరిగిందనీ.. ఆర్థిక వ్యవస్థ కుదేలు  కావడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని  సీఎం వైఎస్‌ జగన్ అన్నారు.   రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోయింది.. అందుకే వైజాగ్‌ గురించి పదే పదే చెబుతున్నాను అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎదగడానికి పెద్ద పెద్ద నగరాలు అవసరమని ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఓ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ప్రతీ రాష్ట్రంలో ఉండాలి అన్నారు సీఎం వైఎస్‌ జగన్‌. రాష్ట్ర విభజనలో హైదరాబాద్‌ను కోల్పోయి.. ..  తాను పదే పదే విశాఖపట్నం ప్రస్థావన ఎందుకు తీసుకొస్తానంటే.. ప్రతి రాష్ట్రానికి ఓ ఎకనామిక్‌ పవర్‌ హౌస్‌ ఉండాలన్నారు.. 60 ఏళ్లుగా కష్టపడి హైదరాబాద్‌ లాంటి నగరాన్ని నిర్మించుకున్నాం.. కానీ, దానిని కోల్పోయాం అన్నారు.. అందుకే నేను విశాఖ, విశాఖ అంటున్నాని అన్నారు.రాష్ట్రం ప్రతి ఏడాది రూ.13వేల కోట్ల ఆదాయం నష్టపోతుంది అంటూ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌... హైదరాబాద్​, బెంగళూరు లాంటి  పవర్‌హౌజ్‌ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవు అన్నారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయామన్నారు.

చంద్రబాబు ఏనాడూ మంచి చేసింది లేదు.. కానీ, రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి లాగి వెళ్లారని విమర్శించారు సీఎం వైఎస్‌ జగన్..  వైసీపీ ప్రభుత్వంలో  తీసుకొచ్చిన పథకాలు, ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరించారు.. ఇదే సమయంలో.. కేంద్రం కంటే రెట్టింపు స్థాయిలో చంద్రబాబు అప్పులు తెచ్చాడు అని ఫైర్‌ అయ్యారు. కానీ, ఎక్కువ అప్పులు చేశామని వైసీపీ ప్రభుత్వం గురించి  అబద్ధాల ప్రచారం చేస్తున్నారని..కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం అప్పులు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 5.2 శాతం మాత్రమే చేసింది.. ఏ రకంగా చూసినా గత ప్రభుత్వానికి, మనకూ ఎంత వ్యత్యాసముందో చెప్పేందుకు ఈ సమాచారం సరిపోతుందన్నారు సీఎం జగన్​.

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన నాటికి రూ.లక్షా 53 వేల కోట్ల అప్పు ఉంటే.. చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.4.12 లక్షల కోట్లకు చేరిందన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. రూ.4.12 లక్షల కోట్ల అప్పుతో ప్రయాణం ప్రారంభించామని సీఎం జగన్​ తెలిపారు. చంద్రబాబు హయాయంలో ఉన్న 21. 87 శాతం అప్పుల పెరుగుదల రేటు ఉంటే మన హయాంలో మాత్రం అది 12.13 శాతం మాత్రమే ఉందన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. అంటే.. అప్పుల పెరుగుదల 12 శాతానికి పరిమితం చేశామని వెల్లడించారు.. కానీ, మనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అసెంబ్లీ వేదికగా విపక్షాలపై విరుచుకుపడ్డారు. 

ALSO READ :- చంద్రబాబు అనుభవం ఎందుకు పనికొస్తుంది: అసెంబ్లీలో సీఎం జగన్​ 

 మన హయాంలో ఆర్థిక సంఘం సిఫారసుల కంటే రూ. 366 కోట్లు తక్కువగా అప్పులు తీసుకున్నామని గుర్తుచేశారు.. గ్యారెంటీలతో కలిపి వివిధ సంస్థలు చేసిన అప్పులు.. గ్యారెంటీల్లేని అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే  విభజన నాటికి.. రాష్ట్ర ప్రభుత్వం అప్పు  లక్షా 32 వేల కోట్ల రూపాయిలు  ఉందన్నారు. గ్యారెంటీల్లేని ప్రభుత్వ అప్పులు కూడా కలుపుకుంటే మొత్తం అప్పు రూ.లక్షా 53 వేల కోట్లు అన్నారు..