అథ్లెట్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇచ్చిన సీఎం జగన్

అథ్లెట్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇచ్చిన సీఎం జగన్

టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వెళ్లే అథ్లెట్ల ను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. బ్యాడ్మింటన్ ప్లేయర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, హాకీ ప్లేయర్ ఎటిమర్పు రజనిలకు ఆయన అభినందనలు చెప్పారు.

ఏపీలో  క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర సీఎంవో ప్రకటించింది. మరింత మంది క్రీడాకారులకు అవకాశం కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది. అందులో భాగంగా విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు కోసం పి.వి. సింధుకు 2 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.