ఏపీలో కొత్త కేసులు 2,690..మరణాలు 9

ఏపీలో కొత్త కేసులు 2,690..మరణాలు 9

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల నమోదు తగ్గుతూ వస్తుండడంతో కరోనా ఉధృతి తగ్గినట్లేనని తెలుస్తోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 28 వేల 598 మందికి పరీక్షలు చేయగా 2,690 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే కరోనా కారణంగా ప్రకాశం జిల్లాలో ఇద్దరు.. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది చనిపోయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

అలాగే గడచిన 24 గంటల్లో 11,855 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులైనట్లు వైద్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 518 కేసులు నమోదు కాగా.. అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో 36 కేసులు మాత్రమే నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కొత్త కేసుల వివరాలు కింది పట్టికలో చూడండి....

 

 

ఇవి కూడా చదవండి...

ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు

రాజ్యాంగాన్ని కాదు..రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలి

సంగీత ప్రపంచానికి ఆమె లేని లోటు తీర్చలేనిది: ఏఆర్ రెహ్మాన్

ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన మెగాస్టార్