ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే

ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 3,396 కొత్త కేసులు.. 9 మరణాలు నమోదయ్యాయి.  టెస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో కొత్త కేసుల సంఖ్య కూడా తగ్గిపోయింది. గతంలో 50వేల పరీక్షలు నిర్వహించగా.. కొద్ది రోజులుగా సగటున 30 వేల పరీక్షలు జరుగుతున్నాయి. కేసులు కూడా ఇందుకు అనుగుణంగానే నమోదు అవుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 29,838 మందికి పరీక్షలు చేయగా.. 3,396 కేసులు నమోదయ్యాయి.

కరోనా వల్ల అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది చనిపోయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో వైపు గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 13వేల 5 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. జిల్లా వారీగా నమోదైన కేసుల సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 516 కేసులు నమోదు కాగా.. అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో 46కేసులు మాత్రమే నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు కింది పట్టికలో చూడండి....

 

ఇవి కూడా చదవండి: 

స్కూల్స్ రీఓపెన్ చేయండి.. లేకుంటే ఓటేయ్యం

కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు

యోగి వద్ద కోటిన్నర ఆస్తులు, రివాల్వర్‌‌, రైఫిల్

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయకుంటే నిరసన కాదా?

కశ్మీర్‌‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత