ఏపీ ఎలక్ట్రానిక్​ పవర్​ హౌస్ : మంత్రి లోకేష్​

ఏపీ ఎలక్ట్రానిక్​ పవర్​ హౌస్ : మంత్రి లోకేష్​

 ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని  విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు .అంతర్జాతీయస్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్ జి ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ యూనిట్ కు లోకేష్ భూమిపూజ చేశారు.  ఎల్ జి యూనిట్ కు మాత్రమే కాదు - ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నామన్నారు. 

ఆంధ్రప్రదేశ్​ లో  పెట్టే పెట్టుబడులు యువత    భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని లోకేష్​ అన్నారు. రూ. 50 వేల కోట్లకు పైగా పెట్టుబడితో LG ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయి తయారీ యూనిట్‌ను తీసుకురావడమే గాక ఎపిని పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రపంచ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తోంది. మేడ్ ఇన్ ఆంధ్ర నుండి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకు మా జైత్రయాత్ర కొనసాగుతుదన్నారు. 

►ALSO READ | వైసీపీ నేత నారాయణరెడ్డి హత్య కేసులో.. 11 మందికి జీవిత ఖైదు

LG ఫ్యాక్టరీ అధునాతన గృహోపకరణాలైన రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు స్మార్ట్, ఇంధన సమర్థవంతమైన సాంకేతికతతో ఉత్పత్తులను అందిస్తుంది.  దీని ద్వారా  1,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఎల్ జి నాలుగు కీలక విక్రేత భాగస్వాములైన ఎకోరియా,  కురోడా ఎలక్ట్రిక్, హేంగ్ సంగ్ ఇండియా, క్యుంగ్‌సంగ్ ప్రెసిషన్ అండ్ టేసంగ్ ఎలక్ట్రానిక్స్‌ భాగస్వామ్య శక్తి పురోగతికి పాస్‌పోర్ట్ లాంటివని ... ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్​  రూపుదిద్దుకుంటుందని మంత్రి లోకేష్​ అన్నారు.