
న్యాయమూర్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఎంపీ నందిగాం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ నేత రవిచంద్రారెడ్డి సహా 49 మంది హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల హైకోర్టులో వచ్చిన కొన్ని తీర్పులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో కొందరు నేతలు.. జడ్జిలను, న్యాయవ్యవస్థను అగౌరవపరిచేలా మాట్లాడారని, సోషల్ మీడియాలో పోస్టులు చేశారని హైకోర్టు రిజిస్ట్రార్ మెయిల్ కు ఫిర్యాదులు అందాయి. వీడియోలు, సోఫల్ మీడియా పోస్టులకు సంబంధించిన ఆధారాలను పరిశీలించి కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసి.. హైకోర్టు విచారణకు స్వీకరించింది. బాపట్ల ఎంపీ నందిగాం సురేశ్ సహా 49 మందికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.