టీడీపీ  సీనియర్ నేత యడ్లపాటి వెంకటరావు మృతి

టీడీపీ  సీనియర్ నేత యడ్లపాటి వెంకటరావు మృతి

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకటరావు (102) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని కుమార్తె ఇంట్లో ఉంటూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా బోడపాడు గ్రామంలో 1919 డిసెంబర్ 16న జన్మించిన ఆయన 1967లో గుంటూరు జిల్లా వేమూరి నుంచి స్వతంత్ర పార్టీ తరపున ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. అటు తర్వాత 1978లో కాంగ్రెస్ లో చేరి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి గెలిచిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వంలో  1978-80 మధ్య కాలంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 1983లో టీడీపీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా అనేక పదవులు నిర్వహించారు. 1995లో గుంటూరు జడ్పీ ఛైర్మన్ గా పనిచేసి తనదైన ముద్ర వేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా పార్టీ 1998లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది. 2003లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయి.. 2004లో కాంగ్రెస్ సారథ్యంలో వైఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరం జరిగారు. 

 

ఇవి కూడా చదవండి

నల్లమల చెంచులపై  రాజ్‌భవన్​ ఫోకస్

ఎస్​బీఐ‑పోస్టాఫీసు వడ్డీ రేట్లు..వీటిలో ఏది బెస్ట్?

ఆధార్ కార్డ్‌‌‌‌లో  ఫొటో మార్చండి ఇలా...