విభజన సమస్యల పరిష్కార కమిటీ తొలి సమావేశం

విభజన సమస్యల పరిష్కార కమిటీ తొలి సమావేశం

ఏపీ, తెలంగాణ విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఇవాళ మొదటి సమావేశం నిర్వహిస్తోంది. ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో అధికారులు సమావేశమై సమస్యల పరిష్కారానికి చర్చిస్తారు. మీటింగ్ ఎజెండాలో ఐదు అంశాలు చేర్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, ఏపీ విద్యుత్ సంస్థలకు తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలు, పన్నుల విషయంలో లోపాల తొలగింపు, నగదు నిల్వలు, డిపాజిట్ల విభజన, ఏపీ, తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల క్యాష్ క్రెడిట్ వ్యవహారంపై అధికారులు చర్చిస్తారు. కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో ఈ కమిటీ సమావేశం జరగబోతోంది. పరిష్కారం కాని విభజన సమస్యలను చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ఈ సమావేశం నిర్వహిస్తోంది. కమిటీలో సభ్యులుగా ఏపీ నుంచి ఎస్‌.ఎస్‌.రావత్‌, తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం..

యూపీలో బావిలో పడి 13 మంది మృతి

మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట విషాదం

కేసీఆర్‎కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు