అపర్ణకు షార్ట్‌‌ టైంలోనే ఇంత క్రేజ్ తెచ్చిపెట్టిన షార్ట్ బ్రేక్‌‌ ఛానెల్‌‌

అపర్ణకు షార్ట్‌‌ టైంలోనే ఇంత క్రేజ్ తెచ్చిపెట్టిన షార్ట్ బ్రేక్‌‌ ఛానెల్‌‌

అపర్ణ తండేల్‌ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ.. ‘‘షీలా దీదీ” అంటే మాత్రం సోషల్‌ మీడియా వాడేవాళ్లలో చాలామందికి తెలుసు. కడుపుబ్బా నవ్వించే షార్ట్ వీడియోస్‌ చేస్తుండడంతో తక్కువ టైంలోనే కోట్ల మంది అభిమానించే స్టార్ అయిపోయింది. ఆమె చేసిన కొన్ని షార్ట్‌ వీడియోలకు పదిహేను కోట్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. 

షీలా దీది స్క్రీన్‌‌ మీద కనిపించిందంటే చాలు.. ఆ వీడియోకు కొన్ని కోట్ల వ్యూస్‌‌ రావడం ఖాయం. అంతేకాదు.. ఆమె అసలు పేరు అపర్ణ తండేల్‌‌ అయినా.. అందరికీ షీలా అనే తెలుసు. జనాలు ఆ పేరుకి అంతలా కనెక్ట్ అయ్యారంటే ఆమె ఆ క్యారెక్టర్‌‌‌‌లో ఎంతలా లీనమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అపర్ణది మహారాష్ట్రలోని పుణె. 21 డిసెంబర్ 2000న పుట్టింది.  మిడిల్‌‌క్లాస్‌‌ మరాఠీ కుటుంబం వాళ్లది. ప్రైమరీ, హై స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌ పుణెలో పూర్తి చేసింది. ఈ మధ్యే గ్రాడ్యుయేషన్‌‌ కూడా పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌‌, డాన్స్, మోడలింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడూ సోషల్ మీడియా ఫ్లాట్‌‌ఫామ్స్‌‌లో యాక్టివ్‌‌గా ఉండేది. చిన్న వీడియోలు చేసి, సోషల్‌‌ మీడియాలో పోస్ట్ చేస్తుండేది. 2016లో  మోడలింగ్ కూడా మొదలుపెట్టింది. 2017 నుంచి తన యాక్టింగ్‌‌ టాలెంట్‌‌ని నిరూపించుకునేందుకు సోషల్ మీడియాలో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. వాళ్ల కాలేజీలో ఏ ఈవెంట్‌‌ జరిగినా అపర్ణ పర్ఫార్మ్‌‌ చేసేది.  ఆ తర్వాత టిక్‌‌టాక్‌‌లోకి ఎంటర్ అయింది. టిక్‌‌టాక్‌‌లో ఎప్పుడూ ఏదో ఒక షార్ట్ వీడియో అప్‌‌లోడ్‌‌ చేస్తూనే ఉండేది. కానీ.. సక్సెస్‌‌ అంతగా రాలేదు. 

షార్ట్‌‌ వీడియోలు 

మొదట్నించీ అపర్ణ ఎక్కువగా షార్ట్ వీడియోలే చేసేది. అయినా.. సక్సెస్‌‌ రాలేదు. దాంతో ఆర్మోక్స్‌‌ మీడియా ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ ఫౌండర్‌‌‌‌ అరుణ్ ప్రభుదేశాయ్ పెట్టిన యూట్యూబ్‌‌ ఛానెల్‌‌ టీంతో కలిసి వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ఈ టీం అంతా కలిసి ‘కామ్‌‌వాలీ బాయ్‌‌’ పేరుతో వెబ్‌‌ సిరీస్‌‌ తీశారు. దాంతోపాటు ఈ సీరీస్‌‌లోని వీడియోలతోనే యూట్యూబ్‌‌ షార్ట్స్‌‌ కూడా చేసేవాళ్లు. ఈ షార్ట్స్‌‌ని “షార్ట్స్‌‌ బ్రేక్‌‌” ఛానెల్‌‌లో, ఫుల్‌‌ వీడియోలను ‘‘టేక్ ఏ బ్రేక్‌‌” ఛానెల్‌‌లో పెడుతున్నారు. ఈ సిరీస్‌‌ సూపర్‌‌‌‌ సక్సెస్‌‌ అయింది. ముఖ్యంగా ఇందులోని షార్ట్స్‌‌ బాగా వైరల్‌‌ అయ్యాయి. దాంతో సిరీస్‌‌లో లీడ్‌‌ రోల్‌‌లో నటించిన అపర్ణ పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. 

కామెడీ హైలైట్‌‌

కామ్‌‌వాలీ బాయ్‌‌ సిరీస్‌‌లో జనాలు ఎక్కువగా కనెక్ట్ అయ్యేది అపర్ణ చేసిన షీలా దీదీ క్యారెక్టర్‌‌‌‌కే. షీలా దీదీ ఒక పనిమనిషి. వాళ్ల యజమానిని ముప్పు తిప్పలు పెడుతుంది. మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. కామెడీ జనరేట్‌‌ చేయడం వల్లే ఈ సిరీస్‌‌ హిట్‌‌ అయ్యింది. దాదాపు 20 సెకన్లు ఉండే షార్ట్‌‌ వీడియోలోనే కామెడీ ట్రాక్‌‌ని పెట్టడంతో చూసేందుకు చాలామంది ఇష్టపడ్డారు. పైగా అపర్ణ కామెడీ టైమింగ్‌‌ చాలా బాగుంటుంది. వెంటవెంటనే వేరియేషన్లు చూపించడం జనాలను బాగా ఆకట్టుకుంది.  

షార్ట్‌‌ బ్రేక్‌‌  

అపర్ణకు షార్ట్‌‌ టైంలోనే ఇంత క్రేజ్ తెచ్చిపెట్టిన షార్ట్ బ్రేక్‌‌ ఛానెల్‌‌ని 2021 జూలైలో మొదలుపెట్టారు. సిరీస్‌‌ వీడియోలను అప్‌‌లోడ్‌‌ చేసే టేక్‌‌ ఏ బ్రేక్‌‌ ఛానెల్‌‌ని 2021 డిసెంబర్‌‌‌‌లో మొదలుపెట్టారు. ఇందులో మొదటి ఛానెల్‌‌ షార్ట్‌‌ బ్రేక్‌‌కి కోటీ పదమూడు లక్షలకు పైగా సబ్‌‌స్క్రయిబర్స్‌‌ ఉన్నారు. టేక్ ఏ బ్రేక్‌‌ ఛానెల్‌‌ని పద్నాలుగు లక్షలమంది సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నారు. పుణెకి చెందిన ఒక చిన్న మీడియా సంస్థ ఆర్మోక్స్‌‌ మీడియా ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ ఈ ఛానెల్స్‌‌ని నడుపుతోంది. షీలా దీదీ వల్ల షార్ట్ బ్రేక్‌‌ ఛానెల్‌‌కు ఏడాదిలోనే కోటి మందికి పైగా ఫాలోయర్స్‌‌ ఉన్నారు. ఇందులో ఒక వీడియోకి ఏకంగా 183 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.  అంతేకాదు.. ‘‘కామ్‌‌వాలీ బాయి” సిరీస్‌‌ మొదటి ఎపిసోడ్‌‌కి కేవలం రెండు రోజుల్లోనే 20 లక్షల వ్యూస్ వచ్చాయి.