వచ్చే వారంలో తెరుచుకోనున్న యాపిల్ స్టోర్స్

వచ్చే వారంలో తెరుచుకోనున్న యాపిల్ స్టోర్స్

న్యూయార్క్: కరోనా ఎఫెక్టుతో మూతపడిన యాపిల్ స్టోర్లను.. యూఎస్ లో వచ్చే వారంలో తెరవనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా దేశాలలో ఇప్పటికే 70 స్టోర్లను ఓపెన్ చేసిన యాపిల్ కంపెనీ.. ఆ దేశాల్లో పాటిస్తున్నట్లుగానే యూఎస్ స్టోర్లలో సోషల్ డిస్టెన్స్ ప్రొటొకాల్ కంపల్సరీ పాటిస్తామని, కస్టమర్లు సహకరించాలని కోరింది. స్టోర్లలోకి వచ్చే ప్రతిఒక్కరికీ టెంపరేచర్ చెక్ చేసి, ఫేస్ మాస్క్ ఉన్నవారినే అనుమతిస్తామని చెప్పింది.
యూఎస్ లోని ఇడాహో, సౌత్ కరోలినా, అలబామా, అలాస్కా స్టేట్​లలో తొలుత ఆరు షోరూమ్​లను ప్రారంభిస్తామని, పరిస్థితులను బట్టి ఆ తర్వాత మరోవారంలో మిగతా స్టోర్లన్నీ ఓపెన్ చేస్తామని కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. స్టోర్లలో లిమిటెడ్​గా కస్టమర్లను అనుమతిస్తామని, వినియోగదారులు ఆన్ లైన్ కొనుగోలుకు ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు. వైరస్ నియంత్రణలో ఉన్న దేశాల్లోనూ స్టోర్లను ఓపెన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యూఎస్ లో 271 యాపిల్ స్టోర్లుండగా.. ప్రపంచవ్యాప్తంగా 500 కు పైగా స్టోర్లు ఉన్నాయి.