టాప్-8 దేశాల వీసాల కోసం ఇలా అప్లై చేయాలి

టాప్-8 దేశాల వీసాల కోసం ఇలా అప్లై చేయాలి

విదేశాల్లో చదవాలనేది చాలామంది కల. ఆ కల నెరవేరాలంటే ఎన్నో వ్యయప్రయాసలుంటాయి. మంచి అకడమిక్ మెరిట్‌‌‌‌తో పాటు ఎంట్రన్స్ టెస్ట్ స్కోర్ సాధించాలి. యూనివర్శిటీ నుంచి అడ్మిషన్ ఆఫర్ అందాలి. అన్నింటికి మించి వీసా రావాలి. ప్రతి దేశానికి సొంత ఇమ్మిగ్రేషన్ లాస్, వీసా పాలసీలుంటాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు అందిస్తున్న వీసాలు, వాటి నిబంధనలు, వర్క్​ పర్మిట్స్​ అండ్​ డిపెండెంట్​ వీసాలు, ఫీజు వివరాలు, కావాల్సిన డాక్యుమెంట్‌‌‌‌లు తదితర సమాచారం..

విద్యార్థి చదువుతున్న కోర్సు డ్యురేషన్ ఆధారంగా కొన్ని దేశాలు లాంగ్‌‌‌‌టెర్మ్, షార్ట్‌‌‌‌టెర్మ్ అనే రెండు రకాల వీసాలను అందిస్తున్నాయి. 3 నెలల కంటే తక్కువ వ్యవధి కోర్సులకు షార్ట్‌‌‌‌టెర్మ్, ఆ పైన లాంగ్‌‌‌‌టెర్మ్ వీసాలను మంజూరు చేస్తారు. మరి కొన్ని దేశాలు టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ (యూజీ/పీజీ/డాక్టోరల్) ఆధారంగా వీసాలను  జారీ చేస్తాయి. ఇందుకు గాను పాస్‌‌‌‌పోర్ట్, బోనఫైడ్ సర్టిఫికెట్, ఫైనాన్షియల్ ల్యుసిడిటీ, లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ స్కోర్ వంటివి తప్పనిసరిగా సమర్పించాలి.

అమెరికాలో ఎఫ్–1
యూఎస్ వర్శిటీల్లో బ్యాచిలర్స్, మాస్టర్స్ ప్రోగ్రాములు చదవాలనుకునేవారికి మూడు రకాల వీసాలు జారీ చేస్తారు. అవి ఎఫ్–1 స్టూడెంట్ వీసా, జే–1 ఎక్సేంజ్ విజిటర్ వీసా, ఎం–1 వొకేషనల్ వీసా. ఇందులో వారానికి 18 గంటల కంటే ఎక్కువ సమయం చదవాలనుకునేవారికిచ్చే వీసా ఎఫ్–1 స్టూడెంట్ వీసా. అన్ని యూజీ, మాస్టర్స్ ప్రోగ్రాములకు ఇది వర్తిస్తుంది. ఈ వీసా కలిగిన వారి భార్యా, పిల్లలు అమెరికాలో ప్రవేశించాలంటే తీసుకోవాల్సిన డిపెండెంట్​ వీసా ఎఫ్​–2. ఇందులో భార్య పనిచేయడానికి కుదరదు కానీ స్టడీ కోసం సొంత ఎఫ్–1 వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. జే‌‌‌‌–1 అనేది ఇతర దేశాల యూనివర్శిటీల్లో ఆఫర్ చేస్తున్న ఎక్స్‌‌‌‌చేంజ్ ప్రోగ్రామ్స్​ చదవడానికి ఇచ్చే వీసా. సాధారణంగా దీనిని వర్కింగ్ ప్రొఫెషనల్స్ కు జారీ చేస్తారు. ఇదే కేటగిరీలో భార్యా పిల్లలకు ఇచ్చేది జే–2. వీరికీ జాబ్ చేసుకునే సదుపాయం ఉండదు. అలాగే వొకేషనల్ అండ్ టెక్నికల్ కోర్సులు చదవాలంటే పొందాల్సిన వీసా ఎం–1. ఎఫ్–1, ఎం–1 వీసాలకు 350, జే–1 కు 180 యూఎస్ డాలర్ల ఫీజు ఉంటుంది. ఎఫ్–1 వీసాదారులకు స్టడీస్​ తర్వాత ఒక సంవత్సరం వరకు ఉద్యోగం చేసుకునేందుకు అనుమతిస్తారు.

వెబ్‌‌‌‌సైట్:www.fmjfee.com

యూకేలో టైర్–4
బ్రటన్‌‌‌‌లో పాయింట్స్ ఆధారంగా వీసా జారీ చేస్తారు. కోర్సు అడ్మిషన్ కన్‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌కు 30 పాయింట్లు, ఫైనాన్సియల్ స్టెబిలిటీకి 10 పాయింట్లు, మొత్తం 40 పాయింట్లు ఇచ్చి వీసా ఇస్తారు. ఇక్కడ చదువుకోవాలనుకునేవారికి టైర్–4 వీసా ఇస్తారు. ఇందులో రెండు రకాలున్నాయి. 16 ఏళ్లు నిండి ఉన్నత చదువులకు వెళ్లేవారికి ఇచ్చేది జనరల్ స్టూడెంట్ వీసా కాగా, 4 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్నవారికి ఇచ్చేది చైల్డ్ స్టూడెంట్ వీసా.  జనరల్ వీసాకు 348 యూకే పౌండ్స్ ఫీజుగా చెల్లించాలి. ఈ వీసా కింద వారానికి 20 గంటలు, సమ్మర్ మరియు సెలవుల్లో ఫుల్‌‌‌‌టైం వర్క్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మాస్టర్స్​ డిగ్రీ చదువుతున్న వారి భార్యా, పిల్లలకు మాత్రమే డిపెండెంట్​ వీసా ఇచ్చే విధానం ఇక్కడ ఉంది. పోస్ట్​ స్టడీ వర్క్​ సౌకర్యం లేదు. కానీ స్టడీస్​ తర్వాత బ్రిటన్​లో ఉండాలనుకునేవారు హై స్కిల్డ్​ వర్కర్​ కింద టైర్​–2 వీసా పొందాల్సి ఉంటుంది.

వెబ్‌‌‌‌సైట్: www.gov.uk/browse/visas-immigration

కెనడాలో స్టడీ పర్మిట్
అకడమిక్ స్కోర్ ఆధారంగా కెనడాలోని యూనివర్శిటీల్లో చదువుకునేందుకు జారీ చేసేది స్టడీ పర్మిట్. దీనిని కెనడాలో ఎంటరైన తర్వాత జారీ చేస్తారు. ఇందుకు గాను 150 కెనడియన్ డాలర్ల ఫీజు చెల్లించాలి. స్టడీ పర్మిట్ పొందడానికి ముందు అభ్యర్థులు కెనడియన్ హై కమిషన్ నుంచి టెంపరరీ రెసిడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. చదువు పూర్తయిన 90 రోజుల్లోపు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కెనడాలో చదువుతున్న వారి భార్య/భర్త డిపెండెంట్ వీసా ద్వారా సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటే ఫుల్‌‌‌‌టైం వర్క్ చేసుకునే వెసులుబాటు ఉంది. వారికి ముందే జాబ్ లేకున్నా ఓపెన్ వర్క్ పర్మిట్ ద్వారా కెనడాలో ఎంటరైన తర్వాత కూడా ఉద్యోగం చూసుకోవచ్చు.

వెబ్‌‌‌‌సైట్:www.canada.ca

సబ్‌‌‌‌క్లాస్ 500
ఆస్ట్రేలియాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు వీసాలు జారీ చేయడానికి సింప్లిఫైడ్ స్టూడెంట్ వీసా ఫ్రేమ్‌‌‌‌వర్క్ ను ఆస్ట్రేలియా ప్రభుత్వం 2016 నుంచి అమలు చేస్తుంది. సర్టిఫికెట్, డిప్లొమా, వొకేషనల్ గ్రాడ్యుయేట్, యూజీ, మాస్టర్స్ డాక్టోరల్ డిగ్రీ వంటి ఫుల్‌‌‌‌టైం కోర్సులు చదవాలనుకునేవారు సబ్‌‌‌‌క్లాస్–500 కింద దరఖాస్తు చేసుకోవాలి. పార్ట్‌‌‌‌టైం, డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులు చదవాలనుకునే వారు దీనికి అర్హులు కాదు. ఈ వీసా ‌‌‌‌ఫీజు 575 ఆస్ర్టేలియా డాలర్లు. వీసా పొందాలంటే ఆస్ట్రేలియాలో తాత్కాలికంగా మాత్రమే నివాసం ఉంటామని తెలిపే (జెన్యూన్ టెంపరరీ ఎంట్రెంట్) ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. కోర్సు కాలానికి రెండు నుంచి మూడు నెలలు అదనంగా వీసా జారీ చేస్తారు.

వెబ్‌‌‌‌సైట్:www.immi.homeaffairs.gov.au

 

ఫ్రాన్స్‌‌‌‌లో వీఎల్టీ-టీఎస్
ఫ్రాన్స్‌‌‌‌లో మూడు రకాల వీసాలున్నాయి. అవి షార్ట్‌‌‌‌‌‌‌‌-స్టే-స్టూడెంట్, టెంపరరీ లాంగ్ స్టే, లాంగ్ స్టే వీసాలు. మూడు నెలల లోపు ఉన్న లాంగ్వేజ్ కోర్సులు, షార్ట్ టెర్మ్ ప్రోగ్రాములకు షార్ట్‌‌‌‌-స్టే-స్టూడెంట్ వీసా తీసుకోవాలి. ఇందులో ప్రత్యేక రెసిడెంట్ వీసా అవసరం లేదు. మూడు నుంచి ఆరు నెలల కోర్సులు చదవాలంటే తీసుకోవాల్సింది టెంపరరీ లాంగ్ స్టే వీసా. బ్యాచిలర్స్, మాస్టర్స్, పీహెచ్‌‌‌‌డీ వంటి లాంగ్ డ్యురేషన్ కోర్సులు చదివేవారికిచ్చేది లాంగ్ స్టే వీసా. ఫీజు 50 పౌండ్‌‌‌‌లు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే భార్య, పిల్లలు ఫ్రాన్స్‌‌‌‌లో నివాసం ఉండొచ్చు. ఇందుకు చాలా నిబంధనలుంటాయి. 964 గంటలకు పైగా వర్క్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ మాస్టర్స్ పూర్తయిన వారు 12 నెలల కాలానికి తాత్కాలిక నివాస పరిమితి (APS) పొందాలి.

వెబ్‌‌‌‌సైట్:www.france-visas.gouv.fr

సింగపూర్​లో స్టూడెంట్​ పాస్​
ఏదైనా సింగపూర్​ ఇన్​స్టిట్యూషన్​ నుంచి ఆఫర్​ లెటర్​ అందుకున్న వారు సింగపూర్​ ఇమ్మిగ్రేషన్​ అండ్​ చెక్​ పాయింట్​ అథారిటీ (ఎస్​ఐసీఏ) నుంచి స్టూడెంట్​ పాస్​ పొందాలి. ఇందుకుగాను స్టూడెంట్​ పాస్​ ఆన్​లైన్​ అప్లికేషన్​ అండ్​ రిజిస్ర్టేషన్​ సిస్టం (SOLAR) ద్వారా కోర్సు ప్రారంభానికి కనీసం ఒక నెల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు 20 సింగపూర్​ డాలర్లు. అప్రూవల్​ తర్వాత వీసా జారీ చేయడానికి 60 డాలర్లు, మల్టిపుల్​ ఎంట్రీ వీసా ఫీజు కింద మరో 30 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. సోషల్​ విజిట్​ పాస్​ ద్వారా గ్రాడ్యుయేట్​, రీసెర్చ్​ విద్యార్థుల భార్యా పిల్లలకు సింగపూర్​ లో నాలుగు వారాల పాటు నివాసం ఉండడానికి అనుమతిస్తారు. ఇదే పాస్​తో వారానికి 16 గంటలు, హాలిడేస్​లో ఫుల్​టైం వర్క్​ చేసుకోవడానికి అనుమతిస్తారు. స్టడీస్​ తర్వాత ఉద్యోగం చేయాలంటే అదనంగా ఒక సంవత్సర కాలానికి అనుమతి లభిస్తుంది.

వెబ్‌‌‌‌సైట్:www.eservices.ica.gov.sg

జర్మనీలో రెసిడెన్స్ పర్మిట్​
జర్మనీలో 90 రోజుల కంటే ఎక్కువ కాలం ఉండి చదువుకోవాలనుకునేవారు రెసిడెన్స్​ పర్మిట్​ పొందాల్సి ఉంటుంది. దీనిని గరిష్టంగా రెండేళ్ల కాలానికి జారీ చేస్తారు. కోర్సు డ్యురేషన్ ను బట్టి రెన్యువల్​ చేసుకోవాలి. కనీసం రెండు నుంచి మూడు నెలలు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వీసా త్వరగా పొందే అవకాశం ఉంటుంది. ఫీజు 110 బ్రిటన్​ పౌండ్స్​. తగినంత ఫైనాన్సియల్​ సపోర్ట్​ ఉందని నిరూపించుకోగలిగితే భార్యాపిల్లలు జర్మనీలో నివసించడానికి అనుమతిస్తారు. అక్కడి రూల్స్​ ప్రకారం అకడమిక్ సంవత్సరంలో 180 హాఫ్​ షిప్ట్స్​ లేదా 90 రోజుల పాటు వర్క్​ చేసుకునే సౌలభ్యం ఉంది. ప్రస్తుతం స్టడీస్​ రిలేటెడ్ ఫీల్డ్​లో పార్ట్​టైం జాబ్​ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఏకైక దేశం జర్మనీ.

వెబ్‌‌‌‌సైట్:www.india.diplo.de

న్యూజిలాండ్​లో..
ఈ దేశంలో మూడు నెలల కంటే ఎక్కువగా స్టడీస్​ కొనసాగించాలనుకునేవారు స్టూడెంట్​వీసా పొందాల్సి ఉంటుంది. దీనికి 295 న్యూజిలాండ్​ డాలర్ల ఫీజు అవుతుంది. ఆ దేశ హై కమీషన్​ కు వీసా పూర్తి చేయడానికి కనీసం 8 నుంచి 12 వారాల సమయం పడుతుంది కాబట్టి విద్యార్థులు రెండు నుంచి మూడు నెలల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఇదే వీసా మీద భార్యా పిల్లలకు కోర్సు డ్యురేషన్​ వరకు నివాసం ఉండటానికి అనుమతిస్తారు. వారానికి 20 గంటల వరకు పార్ట్​టైం వర్క్​ చేసుకునే వెసులుబాటు ఉంది. స్టడీస్​ తర్వాత ఉద్యోగం చేసుకోవడానికి అదనంగా 12 నెలల కాలం వరకు పోస్ట్ స్టడీ వీసా పొందొచ్చు.

వెబ్సైట్​: www.immigration.govt.nz