చైనా బార్డర్​లో ఇరువైపులా ఆర్మీ మోహరింపులున్నయ్: జైశంకర్ 

చైనా బార్డర్​లో ఇరువైపులా ఆర్మీ మోహరింపులున్నయ్: జైశంకర్ 

న్యూఢిల్లీ: లడఖ్​లోని హిమాలయన్ ప్రాంతం లో ఇండియా, చైనా మధ్య పరిస్థితి చాలా బలహీనంగా ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. బార్డర్​లో ఇరువైపులా చాలా దగ్గరగా ఆర్మీ బలగాల మోహరింపులు ఉన్నాయని, దీనివల్ల రెండు దేశాల మధ్య పరిస్థితి ప్రమాదకరంగా మారిందన్నారు. శనివారం ‘ఇండియా టుడే కాన్ క్లేవ్’లో ఆయన మాట్లాడారు. గల్వాన్ లోయలో 2020లో జరిగిన గొడవలో మన ఆర్మీకి చెందిన 20 మంది సోల్జర్లు, చైనా వైపు 40 మంది జవాన్లు చనిపోయారు. పోయినేడు డిసెంబర్​లో అరుణాచల్​లోని తవాంగ్ సెక్టార్​లోనూ ఇరు దేశాల సోల్జర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో  గల్వాన్ లో గొడవ జరిగి రెండేండ్లు గడిచినా.. చర్చలు జరిగినా.. ఇప్పటికీ చైనా బార్డర్​లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని జైశంకర్ అభిప్రాయపడ్డారు.