
హైదరాబాద్, వెలుగు: ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ) ఆర్థా గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్ ఇండియాలో నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌పీఏల) సెక్యూరిటీస్ రిసీట్స్‌లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్ నుంచి బయటకు వచ్చింది. మొదట 112 మిలియన్ డాలర్లు (రూ.960 కోట్లు) ఇన్వెస్ట్ చేయగా, దీనిపై రెండేండ్లలో 6 రెట్లకు పైగా లాభం సంపాదించామని కంపెనీ చెబుతోంది. ఈ ఫండ్ 132.5 మిలియన్ డాలర్ల (రూ.1,100 కోట్లు) క్లోజ్డ్-ఎండెడ్ ఫండ్, 7 సంవత్సరాల టెన్యూర్‌తో ఉంది.