1.62 కోట్ల మందికి స్కిల్స్​నేర్పాలె

1.62 కోట్ల మందికి స్కిల్స్​నేర్పాలె
  •    ఏఐ, ఆటోమేషన్​ నేర్చుకోవాలె
  •     రాబోయే రోజుల్లో వీటితోనే భారీ ఉద్యోగాలు
  •     వెల్లడించిన సర్వీస్​ నౌ

న్యూఢిల్లీ: మనదేశ  నైపుణ్య లోటును తీర్చడానికి 1.62 కోట్ల మంది వర్కర్లకు ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ),  ఆటోమేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కిల్స్​ నేర్పించాలని ఐటీ సంస్థ సర్వీస్​నౌ రీసెర్చ్, పియర్సన్​ స్టడీ అభిప్రాయపడింది. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో రాబోయే 1,73,300  టెక్,  నాన్-టెక్ ఉద్యోగాలకు ఏఐ,  ఆటోమేషన్ నిపుణులు అవసరమని తెలిపింది. ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. 

మన రాష్ట్రంలోని 1,71,300 మంది కంప్యూటర్ ప్రోగ్రామర్లు రాబోయే 5 సంవత్సరాలలో పరిశ్రమ,  అభివృద్ధి చెందుతున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీర్చడానికి తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. ఇట్లాంటి టెక్నాలజీలు అవసరమయ్యే  జాబ్ పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు గత సంవత్సర కాలంలో  39 శాతం పెరిగాయి. వీటికి బెంగుళూరులో అత్యధిక డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. 2027 నాటికి  అప్లికేషన్ డెవలపర్లు 75వేల మంది, డేటా అనలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 70వేలు, ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 65వేలు, ప్రొడక్ట్​ ఓనర్లు 65వేలు, ఇంప్లిమెంటేషన్​  ఇంజినీర్లు 55 వేల మంది కావాలి.  

సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నౌ తన గ్లోబల్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్ 'రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అప్ విత్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నౌ' ద్వారా ప్రతిభను టెక్నాలజీకి లింక్​ చేస్తోంది. సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నౌ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించి వర్కర్లు అవసరమైన నైపుణ్యాలను పొందేలా చేస్తుంది.  ఏఐ,  ఆటోమేషన్ ప్రభావం వల్ల  2027 నాటికి 46  లక్షల మంది కార్మికులు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది.