ఢిల్లీ పర్యాటక ప్రదేశాల సందర్శనకు దేఖో మేరే ఢిల్లీ యాప్

ఢిల్లీ పర్యాటక ప్రదేశాల సందర్శనకు దేఖో మేరే ఢిల్లీ యాప్

వరల్డ్ ఎన్విరాన్ మెంట్ డే సందర్భంగా..ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్‌ 'దేఖో మేరే ఢిల్లీ' అనే యాప్‌ను సోమవారం ప్రారంభించారు.  రాజధాని పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకునే పర్యాటకులు 'దేఖో మేరే ఢిల్లీ' అనే ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ యాప్‌ ద్వారా పర్యాటకులు ఆహారం తీసుకునే ఫుడ్‌ జంక్షన్‌లు, వినోదాత్మక వేదికల గురించిన సమాచారం తెలుసుకోవడమే కాకుండా... 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలను కూడా గుర్తించవచ్చన్నారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రజలు రాజధాని పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికి సరైన సమాచారం లేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటివారికి ఈ యాప్‌ ద్వారా సమాచారం అందివ్వడమే కాదు.. మరోరకంగా పర్యాటకరంగానికి  ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పర్యాటకులకు ఉపయోగకరంగా ఉండే ఈ యాప్‌ను ఢిల్లీ ప్రజలతో సహా అందరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన కోరారు.

మూడు రకాల వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని పని చేయాలని  'దేఖో మేరే ఢిల్లీ'  యాప్ ను రూపొందించినట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తెలిపారు. కొన్ని పనుల కోసం ఢిల్లీకి వచ్చేవారి కోసం, రెండవది.. ఢిల్లీని చూడటానికి వచ్చేవారి కోసం, మూడోది... ఢిల్లీ ప్రజలు తమ కుటుంబంతో ఎక్కడికైనా వెళ్లాలనుకునేవారి కోసం.. ఇలా మూడు రకాల వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని ఈ యాప్‌ను తయారుచేశామన్నారు.