
పంజాబ్ జలంధర్‌లో దేశంలోనే అతిపెద్ద క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. బుధవారం జలంధర్ లో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న సీఎం కేజ్రీవాల్..పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వస్తే జలంధర్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును నిర్మిస్తామన్నారు. అంతేకాదు పోరాటంలో గెలవాలని, పంజాబ్ సంతోషం కోసం 2022 మార్చిలో ఆప్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.