కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్ గ్రేషియా

కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్ గ్రేషియా

కరోనా సంక్షోభంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి రూ.50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి చనిపోతే ప్రతి నెలా రూ.2500 పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కరోనాతో తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన పిల్లలకు ఉచిత విద్య, 25 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా రూ.2500 పెన్షన్ ఇస్తామన్నారు. ఢిల్లీలో ఉన్న 72 లక్షల రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా ఒక్కో రేషన్ కార్డుకి 5 కేజీల బియ్యం ఇస్తారు. అయితే ఈ నెల 5 కేజీలతో పాటు అదనంగా మరో 5 కేజీల బియ్యం కలిపి మొత్తం 10 కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.