NRC లిస్ట్ బీజేపీకి గుణపాఠం లాంటిదన్నారు MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. లిస్ట్ సరిగా ఉంటే.. అస్సాం బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు కంప్లెయింట్ చేస్తున్నారని ప్రశ్నించారు. అస్సాంలో 50 లక్షల మంది వలసదారులు ఉన్నారని గతంలో అమిత్ షా చెప్పారని.. కానీ ఇప్పుడు 19 లక్షలే ఉన్నారని తేలిందన్నారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ – NRC తాజాగా ప్రకటించిన అధికారిక లెక్కలే ఈ విషయాన్ని చెబుతున్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రుల పేర్లు ఉండి.. పిల్లల పేర్లు మాయమవడం ఏంటని ప్రశ్నించారు.

