
కమర్షియల్ వెహికల్ ఈకామెట్ స్టార్ 1915 ను అశోక్ లేలాండ్ లాంచ్ చేసింది. ఈ బండి గ్రాస్ వెహికల్ వెయిట్ ( పర్మిషన్‌కు తగ్గట్టు ఉన్న లోడ్‌తో కలిపి) 18.49 టన్నులు. ఈ–కామర్స్, పార్శిల్ డెలివరీ వంటి వాటిలో ఈ వెహికల్ బాగా సరిపోతుందని కంపెనీ వెల్లడించింది. ఈకామెట్ స్టార్ 1915 లో 150 హార్స్ పవర్ హెచ్4 ఇంజిన్ అమర్చారు.