కుప్పం ఏఎస్ఐ రాజేంద్ర ఆత్మహత్య

కుప్పం ఏఎస్ఐ రాజేంద్ర ఆత్మహత్య

కుప్పం ఏఎస్ఐ రాజేంద్ర(57) ఆత్మహత్యకు పాల్పడ్డారు.  చిత్తూరు కు చెందిన రాజేంద్ర 2019 సెప్టెంబర్ లో పెనుమూరు నుండి కుప్పంకు బదిలీపై వచ్చారు. పది రోజుల క్రితం చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ మీద వెళ్లాల్సి ఉండగా.. లాక్ డౌన్ కారణంగా రిలీవ్ అవ్వలేదు. అయితే కుప్పం మండలం నడుమూరు చెక్ పోస్ట్ వద్ద విధులకు రాజేంద్ర హాజరు కావాల్సి ఉంది. కానీ రాజేంద్ర విధులకు హాజరు కాకపోవడం, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు.. బాధితుడి ఇంటికి వెళ్లారు. ఇంటి తలుపు ఓపెన్ చేసి ఉండడంతో బయటకు రావాలంటూ కేకలు వేశారు. కానీ రాజేంద్ర నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో బలవంతంగా డోర్ ఓపెన్ చేసి చేశారు. దీంతో ఉరేసుకున్న ఏఎస్ ఐ రాజేంద్ర డెడ్ బాడీ కనిపించింది.  కాగా, కుటుంబ కలహాలతోనా  లేక మరే  ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారన్నది తెలియాల్సి  ఉండగా.. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.