ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి : కనక వెంకటేశ్

ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి : కనక వెంకటేశ్

జైనూర్, వెలుగు: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్​లో పనిచేస్తున్న టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లు వెంటనే చేపట్టాలని ఆసిఫాబాద్ జిల్లా టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కనక వెంకటేశ్ ​డిమాండ్ ​చేశారు. హైదరాబాద్​లో ఆదివారం నిర్వహించిన టీపీటీఎఫ్ మహాసభలో ఆయన పాల్గొని ఆసిఫాబాద్ జిల్లా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. 

జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్​లో పనిచేస్తున్న టీచర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అరకొర వసతులతో విద్యాసేవలు నామమాత్రంగా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీవోను వెంటనే రద్దు చేసి ఏజెన్సీ ఆధారంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్​మెట్​లో బదిలీలు చెప్పటాలని, ఏజెన్సీ డీఎస్సీ పోస్టుల భర్తీ చేయాలని, అర్హతను బట్టి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.