లాయర్ తో జూలియన్ అసాంజే సంబంధం.. ఇద్దరు పిల్లలు!

లాయర్ తో జూలియన్ అసాంజే సంబంధం.. ఇద్దరు పిల్లలు!

లండన్ : వీకిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తన ఇద్దరు పిల్లలకు తండ్రి అని ఆయన తరఫున వాదిస్తున్న లాయర్ స్టెల్లా మోరిస్ తెలిపారు. 2017 లో ఆయనతో ఎంగేజ్ మెంట్ అయినట్లు మోరిస్ చెప్పినట్లు మెయిల్ పత్రిక కథనంలో పేర్కొంది. ఆమె ఇంటర్వ్యూను ఇద్దరు పిల్లలతో మోరిస్ ఉన్న ఫోటోలను కథనలో ప్రచురించింది. అసాంజే లండన్ లోని ఈక్వెడార్ కార్యాలయంలో స్వీయ నిర్భంధంలో ఉన్న సమయంలో తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని మోరిస్ తెలిపినట్లు మెయిల్ పత్రిక వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా సహా పలు దేశాల సీక్రెట్ డాక్యుమెంట్స్ ను వికీలీక్స్ లో బయటపెట్టిన అసాంజేపై పలు కేసులు నమోదు చేశారు. దీంతో చాలాకాలం ఆయన ఈక్వెడార్ రాయబార కార్యాలయంలోనే ఉన్నారు. ఈ సందర్భంగానే తన తరఫు లాయర్ స్టెలా మోరిస్ ద్వారా ఇద్దరు మగబిడ్డలకు తండ్రి అయ్యారట. వారిలో ఒకరికి ఏడాది, మరొకరికి రెండేళ్ల వయసు. దక్షిణాఫ్రికాలో జన్మించిన స్టెల్లాతో అసాంజేకు 2017లో నిశ్చితార్థం కూడా అయ్యిందట. గత నెల అసాంజే కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్ల ద్వారా ఈ సంగతి తెలుసుకున్నట్టు మెయిల్ పత్రిక తెలిపింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఈక్వడార్ దౌత్యరక్షణను ఉపసంహరించడంతో అసాంజే బ్రిటన్‌కు లొంగిపోయారు. బెయిల్ కోసం ఆయన సమర్పించిన పిటిషన్ విచారణ సందర్భంగా లాయర్ స్టెల్లా తనకు, అసాంజేకు మధ్య సంబంధాన్ని వెల్లడించారు. బ్రిటన్ లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అసాంజేను విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే తమ మధ్య బంధాన్ని వెల్లడించినట్లు ఆమె కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నో చెప్పింది.