మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్​గఢ్​లో..గెలిచేది ఎవరో?

మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్​గఢ్​లో..గెలిచేది ఎవరో?
  • ఆ మూడు రాష్ట్రాల్లోనూ ఇయ్యాల్నే కౌంటింగ్

మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, చత్తీస్​గఢ్​లోనూ ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మిజోరంలో సోమవారం ఓట్ల లెక్కింపు ఉంటుంది.  మధ్యప్రదేశ్​లో 230 అసెంబ్లీ సీట్లు ఉండగా, 2,533 మంది క్యాండిడేట్లు బరిలో ఉన్నారు.  రాజస్థాన్ లో 200 సీట్లు ఉండగా, 199 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 1,800 మంది క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు. 

చత్తీస్​గఢ్ అసెంబ్లీలో 90 సీట్లు ఉండగా, 1,181 మంది బరిలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లో బీజేపీకి.. చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్​కు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

4 రాష్ట్రాల్లో ఇయ్యాల్నే కౌంటింగ్

న్యూఢిల్లీ :  నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఆయా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాలకు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. వీటిలో మిజోరం మినహా నాలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ ఆదివారం జరగనుంది. మిజోరంలో సోమవారం ఓట్ల లెక్కింపునకు ఈసీ ఏర్పాట్లు చేసింది. 

క్రిస్టియన్లు మెజార్టీగా ఉన్న మిజోరంలో ఆదివారం కౌంటింగ్ నిర్వహిస్తే.. హాలీ డే రోజున చర్చిల్లో ప్రార్థనలకు ఇబ్బందికరంగా ఉంటుందని పలు పార్టీలు, ఎన్జీవోలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో కౌంటింగ్ తేదీని ఈసీ 4వ తేదీకి మార్చింది. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 అసెంబ్లీ సీట్లు ఉండగా, 2,533 మంది క్యాండిడేట్లు బరిలో ఉన్నారు. రాష్ట్రంలోని 52 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

రాజస్థాన్ లో 200 సీట్లు ఉండగా, 199 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 1,800 మంది క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు. చత్తీస్ గఢ్ అసెంబ్లీలో 90 సీట్లు ఉండగా, 1,181 మంది బరిలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లో బీజేపీకి.. చత్తీస్ గఢ్, తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మిజోరంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మరో ఆరు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు.