చైనా వాళ్లు స్పేస్‌‌‌‌‌‌‌‌లో నడిచిన్రు

చైనా వాళ్లు స్పేస్‌‌‌‌‌‌‌‌లో నడిచిన్రు
  • సొంత స్పేస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ బయట స్పేస్‌‌‌‌‌‌‌‌ వాక్‌‌‌‌‌‌‌‌ చేసిన ఇద్దరు ఆస్ట్రొనాట్లు

బీజింగ్‌‌‌‌‌‌‌‌: చైనా స్పేస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ బయట ఇద్దరు ఆస్ట్రొనాట్లు తొలిసారి స్పేస్‌‌‌‌‌‌‌‌ వాక్‌‌‌‌‌‌‌‌ చేశారు. 15 మీటర్ల రోబోటిక్‌‌‌‌‌‌‌‌ చేయిని అమర్చేందుకు గాను ఆదివారం ఆర్బిటల్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ బయటకు వచ్చిన వాళ్లు స్పేస్‌‌‌‌‌‌‌‌లో నడిచారు. ఆస్ట్రొనాట్లు ల్యూ బూమింగ్, టాంగ్ హాంగ్ బో బయట నడుస్తుండగా కమాండర్ నీ హైషింగ్ లోపలే ఉండి వీళ్ల కదలికలను పర్యవేక్షించారు. వీళ్లిద్దరూ కాసేపు శ్రమించి రోబోటిక్ చేతిని సరిగ్గా అమర్చగలిగారు. స్పేస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ మిగతా భాగాలను అమర్చేందుకు ఈ రోబోటిక్‌‌‌‌‌‌‌‌ చేయి ఉపయోగపడుతుంది. సుమారు 6 గంటల వరకు వాక్ చేయడానికి వీలయ్యేలా ఆస్ట్రొనాట్ల సూట్లను డిజైన్ చేశారు. స్పేస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ తొలి మాడ్యూల్‌‌‌‌‌‌‌‌ తియాన్హేని ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 29న లాంచ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆ తర్వాత ఆహారం, ఇంధనంతో ఆటోమేటెడ్‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ను పంపారు. గత నెల 17న ముగ్గురు ఆస్ట్రొనాట్లను షెంజూ క్యాప్సుల్‌‌‌‌‌‌‌‌లో నింగిలోకి పంపించారు. స్పేస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులు చూసుకునేందుకు మూడు నెలలు వాళ్లు అక్కడే ఉండనున్నారు. స్పేస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు సంబంధిచి మరో 11 ప్రయోగాలను వచ్చే ఏడాది చివరికల్లా చేపట్టాలని చైనా ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. 70 టన్నుల బరువుండే చైనా స్పేస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు మరో రెండు మాడ్యూల్స్‌‌‌‌‌‌‌‌ను బిగించనున్నారు. కాగా, అంతరిక్షంలో తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి చైనా అనేక ప్రయోగాలు చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. చైనా మాత్రం అంతరిక్ష కార్యక్రమాలను ప్రశాంతంగా చేసుకుంటూ పోతోంది.