నైట్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం..13 మంది సజీవదహనం

నైట్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం..13 మంది సజీవదహనం

స్పెయిన్ మర్సియాలోని ఓ నైట్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. చాలా...మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులకు లోకల్ హాస్పిటల్స్ లో చికిత్స కొనసాగుతోంది. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. 

Also Read :- లాస్ ఏంజిల్స్లో కాన్సులేట్ తెరవండి
 

గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. స్పృహ కోల్పోయిన కొందరిని బయటకు తీసి, హాస్పిటల్స్కు తరలించారు. ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.