ఫ్రీ ఎనర్జీ డ్రింక్స్ కోసం ఎగబడ్డ జనం.. కొట్టుకున్నంత పని చేశారు

ఫ్రీ ఎనర్జీ డ్రింక్స్ కోసం ఎగబడ్డ జనం.. కొట్టుకున్నంత పని చేశారు

ఏదైనా వస్తువులు ఫ్రీగా వస్తే ఊరుకుంటారా..? ఎగబడి మరీ తీసుకుంటారు.. అవసరమైతే.. సందర్భం బట్టి లాక్కుకుంటారు కూడా. ఖమ్మంలో అచ్చం ఇలాగే జరిగింది.  వరంగల్ క్రాస్ రోడ్డులో ఓ వ్యక్తి డీసీఎం వాహనాన్ని రోడ్డుపై నిలిపివేశాడు. వాహనంలోని ఎనర్జీ డ్రింక్ (టాటా కంపెనీ) ప్యాకెట్లను రోడ్డుపై వెళ్తున్న వారికి ఫ్రీగా ఇచ్చాడు. ఈ విషయం ఆనోట ఈ నోట చాలామందికి తెలియడంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడకు చేరుకున్నారు. అందినకాడికి తీసుకెళ్లారు. ఫ్రీగా వస్తుండడంతోచాలామంది ఎగబడి మరీ తీసుకున్నారు.  పెద్ద సంఖ్యలో జనం రావడంతో చాలాసేపు రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

అయితే.. దీనిపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. గడువు ముగిసిన (expired product) ఎనర్జీ డ్రింక్స్ ఫ్రీగా అందించారని కొందరు చెబుతుంటే... మరికొందరు మాత్రం ఎక్స్ పైర్ డేట్ ఇంకా ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఫ్రీగా వస్తుంటే ఎవరు మాత్రం వదులుతారు చెప్పండి..ఇక్కడ కూడా అదే జరిగింది.