హైదరాబాద్ AECSలో టీచింగ్ ఉద్యోగాలు.. జీతం 27 వేలు..

  హైదరాబాద్ AECSలో టీచింగ్ ఉద్యోగాలు.. జీతం 27 వేలు..

హైదరాబాద్​లోని ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ (ఏఈసీఎస్, హైదరాబాద్) టీజీటీ, పీఆర్​టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టులు: టీజీటీ, పీఆర్​టీ

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు బి.ఎడ్ సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిప్లొమా, బి.ఈఎల్.ఈడీ, డి.ఈఎల్.ఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. ప్రిన్సిపాల్, ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్–1, డీఏఈ కాలనీ, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్ 500062 చిరునామాకు దరఖాస్తు పంపించాలి. 

అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 23. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 06. 

జీతం : 27 వేల నుండి..  

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, స్కిల్ టెస్ట్, డెమో టీచింగ్ క్లాసెస్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.ecil.co.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.